- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హోలీ రోజు ఈ విలేజ్‌లో అల్లుడు ఎక్కాల్సిందే..! సిగ్గంటే కుదరదు!!
దిశ, వెబ్‌డెస్క్ః వసంత రుతువును స్వాగితిస్తూ వచ్చే హోలీ పండుగ ఇండియాలో ధూంధాంగా సెలబ్రేట్ చేసుకుంటారు. జీవితంలో కనిపించే భావోధ్వేగాల్లా ఆరోజు హోలి రంగులు దేహమంతా అంటుకుంటాయి. అయితే, హోలీని ఆయా సంస్కృతులను బట్టి ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఆచరిస్తారు. కొన్ని చోట్ల ఇది ఇది శ్రీకృష్ణుడు, రాధల అమోఘమైన ప్రేమకు నివాళిగానూ జరుపుకుంటారు. ఫాల్గుణ మాసంలోని పూర్ణిమ తిథి (పౌర్ణమి రోజు) నాడు 'ధులంది' లేదా 'రంగవాలి' హోలీని జరుపుకుంటారు. ఇక, ఈ ఏడాది, 'హోలికా దహన్' మార్చి 17న, 'ధులంది'ని మార్చి 18న జరుపుకుంటున్నారు.
అయితే, ఈ పండుగ వేడుకలకు గుర్తుగా, మహారాష్ట్ర జిల్లాలోని ఓ గ్రామంలో దాదాపు వంద సంవత్సరాలుగా కొనసాగుతున్న ఒక విచిత్రమైన సంప్రదాయం ఉంది. ఆ గ్రామంలో 'కొత్త అల్లుడు' గాడిద ఎక్కి ఊరేగుతాడు. అయితే, అలా చేసి, అతనికి నచ్చిన దుస్తులను డిమాండ్ చేయడం అక్కడ ఆనవాయితీగా వస్తుంది. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలోని కేజ్ తహసీల్‌లో ఉన్న విదా అనే గ్రామంలో ఈ ఆచారాన్ని అనుసరిస్తారు. అయితే, ఇక్కడ ఓ విషయం చెప్పాలి. ఆ ఊరిలో కొత్త అల్లుడిని గుర్తించడం కూడా ఓ తంతులా నిర్వహిస్తారు. అందరూ కలిసి ఈ ఏడాది గాడిద ఎక్కే అల్లుడు ఎవరో నిర్ణయిస్తారు. ఆ అల్లుణ్ణి గుర్తించడానికి మూడు నాలుగు రోజులు పడుతుంది. ఎప్పటి నుంచో వస్తున్న ఈ సంప్రదాయం తెలిసి గాడిద సవారీని తప్పించుకోడానికి సెలెక్ట్ చేసిన ఊరి అల్లుడు పారిపోకుండా కాపలా కూడా కాస్తుంటారు గ్రామస్థులు.
చరిత్రలోకి వెళితే, ఈ సంప్రదాయాన్ని ఆనందరావు దేశ్‌ముఖ్ అనే స్థానికుడు ప్రారంభించినట్లు చెబుతారు. గ్రామస్థులంతా గౌరవించే ఆనందరావు అప్పట్లో స్వయానా తన అల్లుడుతోనే ఈ సంప్రదాయం ప్రారంభించినట్లు తెలుస్తుంది. ఈ కొత్త అల్లుడి గాడిద సవారీ గ్రామం మధ్యలో ప్రారంభమై ఉదయం 11 గంటలకు గ్రామ శివారులోని హనుమాన్ దేవాలయం వద్ద ముగుస్తుంది. అక్కడ ఈ కొత్త అల్లుడికి నచ్చిన బట్టలు ఇస్తారు.
ఎన్నో జాతులు, సంస్కృతుల మిళితమైన ఈ భారతదేశంలో హోలీని కూడా ఆయా సంస్కృతులను బట్టి జరుపుకుంటారు. అందులో లత్మార్ హోలీ, ఖాదీ హోలీ, హోలా మొహల్లా, బసంత్ ఉత్సవ్, డోల్ జాత్రా, షిగ్మో మొదలైనవి ఉన్నాయి.