- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఈసీఐ వెబ్ సైట్ లో లోక్ సభ ఎన్నికల ఫలితాలు.. ఎలా చూడొచ్చంటే?
దిశ, నేషనల్ బ్యూరో: 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం 543 లోక్‌సభ నియోజకవర్గాలకు ఫలితాలు విడుదల కానున్నాయి. మంగళవారం ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభమవుతుందని ఈసీ తెలిపింది. కౌంటింగ్ కోసం అన్ని ఏర్పాటు జరిగాయని అధికారలు తెలిపారు. ఇప్పటికే కౌంటింగ్ గురించి సీఈసీ, ఈసీలు అన్ని రాష్ట్రాల ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసీఐ వెబ్ సైట్ లో ఎన్నికల ఫలితాలు చూసేలా అధికారులు ఏర్పాటు చేశారు.
ఎన్నికల ఫలితాలు ఎక్కడ చూడవచ్చంటే?
రిటర్నంగ్ అధికారులు నమోదు చేసిన డేటా, కౌంటింగ్ ట్రెండ్ లు, ఫలితాలు ఈసీఐ వెబ్ సైట్లో చూసేలా అధికారులు ఏర్పాటు చేశారు. ఈసీఐ వెబ్ సైట్ https://results.eci.gov.in/ లో ఫలితాలు అందుబాటులో ఉంటాయి. అలానే ఐఓఎస్, ఆండ్రాయిడ్ ల్లో అందుబాటులో ఉన్న ఓటర్ హెల్ప్ లైన్ యాప్ లో ఫలితాలు చూడొచ్చు. ఈసీఐ వెబ్ సైట్ లో రిటర్నింగ్ అధికారులు, కౌంటిగ్ ఏజెంట్ల హ్యాండ్ బుక్ అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ వెబ్ సైట్లలో https://tinyurl.com/yknwsu7r / , https://tinyurl.com/mr3cjwhe/ రిటర్నింగ్ అధికారులు నమోదు చేసిన వివరాలు చూడొచ్చు.