యూపీలో కుక్కలను కొట్టిచంపుతున్నారు.. ఎందుకో తెలుసా?

by Swamyn |
యూపీలో కుక్కలను కొట్టిచంపుతున్నారు.. ఎందుకో తెలుసా?
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్‌ ప్రాంతంలో కుక్కలు కనిపిస్తే చాలు స్థానికులు కొట్టి చంపేస్తున్నారు. కాన్పూర్ ఏరియా మొత్తంలో 50వేలకు పైగా కుక్కలు వీధుల్లో స్వైర విహారం చేస్తూ, దాడులు చేస్తున్నాయని స్థానికులు తెలిపారు. కాన్పూర్‌లోని కళ్యాణ్‌పూర్‌లో ఆరు నెలల క్రితం వీధి కుక్కల దాడిలో ఓ శిశువు మృతిచెందింది. గత నెలలో మరో శిశువుపైనా దాడి చేయగా, ఆ చిన్నారి తీవ్రగాయాలపాలైంది. ఓ వృద్ధిడిపైనా తీవ్రంగా దాడి చేశాయి. ఈ విషయమై అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా వారు సరైన చర్యలు తీసుకోవడం లేదు. దీంతో ఈ సమస్యను తామే పరిష్కరించుకోవాలని భావించిన స్థానికులు.. వీధి కుక్కల కర్రలతో కొడుతున్నారు. ఈ దాడిలో తాజాగా ఓ కుక్క చనిపోయింది.


Advertisement

Next Story