JaiSankar: రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి జైశంకర్ సెటైర్లు

by S Gopi |
JaiSankar: రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి జైశంకర్ సెటైర్లు
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సెటైర్లు విసిరారు. శుక్రవారం జెనీవాలో భారతీయ ప్రవాసులను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. జీవితం ఖటా ఖట్(సులభమైన పని) కాదని, దానికోసం కష్టపడి పంచేయాలని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశంలోని సమస్యలను 'ఖటా ఖట్' పరిష్కరిస్తామని రాహుల్ గాంధీ గతంలో అన్నారు. ఆ మాటలను తాజాగా జైశంకర్ వ్యంగ్యంగా ప్రస్తావించారు. మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన మానవ వనరుల గురించి మాట్లాడిన జైశంకర్.. పనిచేసే వ్యక్తులకు హార్డ్‌వర్క్ చేయడంలో ఉన్న ప్రాముఖ్యత తెలుస్తుందని చెప్పారు. 'మానవ వనరులను అభివృద్ధి చేసినప్పటికీ మౌలిక సదుపాయాలను నిర్మించే వరకు హార్డ్‌వర్క్ అనేది కీలకం. కాబట్టి జీవితం అనేది ఖటా ఖట్ కాదు, ఎంతో కష్టంతో కూడుకున్నది' అన్నారు. ఇదే సమయంలో ఏ దేశమైనా తయారీ లేకుండా ప్రధాన శక్తిగా ఎదగదని చెప్పారు. ఉత్పత్తి లేకుండా ప్రపంచంలో ఏ దేశమైనా పెద్ద శక్తిగా ఉండలేదు. ఎందుకంటే ఒక ప్రధాన శక్తికి సాంకేతికత అవసరం. తయారీని అభివృద్ధి చేయకుండా ఎవరూ సాంకేతికతను అభివృద్ధి చేయలేరని జైశంకర్ వివరించారు. మానవ వనరుల పరంగా భారత్ చాలా సాధించిందని, దాన్ని మరింత పెంచడమే ఇప్పుడున్న ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టం చేశారు. అందుకు తగిన ఫలితాలను కూడా చూస్తున్నాం. దేశ సంబంధాలతో పాటు భారత్‌లో ఏం జరుగుతోందనే ఆసక్తిని ప్రపంచ నేతలు వ్యక్తం చేయడం గమనించవచ్చని జైశంకర్ పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed