శ్రీలంక బ్యాటర్ సంచలన నిర్ణయం..

by Vinod kumar |   ( Updated:2023-07-23 13:28:35.0  )
శ్రీలంక బ్యాటర్ సంచలన నిర్ణయం..
X

కొలంబో : శ్రీలంక బ్యాటర్ లాహిరు తిరిమన్నె అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 13 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతున్నట్టు తిరిమన్నె శనివారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ‘ఇది కఠినమైన నిర్ణయం. ఈ నిర్ణయం తీసుకోవడానికి అనూహ్యమైన కారణాలు నన్ను ప్రభావితం చేశాయి. అయితే, అవి నేను ఇక్కడ ప్రస్తావించడం లేదు. ఒక ఆటగాడిగా నేను నా అత్యుత్తమ ప్రదర్శన చేశాను. నేను ఆటను గౌరవించాను. నా మాతృభూమి కోసం నిజాయతీతో సేవలందించాను. నా దేశానికి ప్రాతినిధ్యం వహించినందుకు గౌరవంగా ఫీలవుతున్నా.’ అని లాహిరు తిరుమన్నె రాసుకొచ్చాడు.

2010లో టీమ్ ఇండియాతో వన్డే మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన అతను.. శ్రీలంక తరఫున 44 టెస్టులు, 127 వన్డేలు, 26 టీ20 మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించాడు. బెంగళూరులో భారత్‌తో జరిగిన రెండో టెస్టే తిరుమన్నెకు చివరిది. 2014 టీ20 వరల్డ్ కప్ గెలిచిన శ్రీలంక జట్టులో తిరుమన్నె సభ్యుడిగా ఉన్నాడు.

Advertisement

Next Story

Most Viewed