- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Kejriwal: కేజ్రీవాల్‌కు హర్యానా ప్రభుత్వం షాక్.. కేసు నమోదు చేయనున్నట్టు వెల్లడి!

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆమ్ ఆద్మీ పార్టీ (Aap) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ (Aravind Kejriwal)కు భారీ షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. యమునా (Yamuna) నదిలో విషం కలిపారని ఆయన చేసిన వ్యాఖ్యలకు గాను హర్యానా (Haryana)లోని బీజేపీ ప్రభుత్వం ఆయనపై కేసు నమోదు చేయాలని యోచిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర మంత్రి విపుల్ గోయల్ (Vipul goyal) బుధవారం మీడియాతో మాట్లాడుతూ కేజ్రీవాల్ ఆరోపణల్లో వాస్తవం లేదని, ఆయనపై తప్పకుండా కేసు నమోదు చేస్తామని వెల్లడించారు. ‘హర్యానా, ఢిల్లీ ప్రజల్లో కేజ్రీవాల్ భయాందోళనలను రేకెత్తించారు. బాధ్యతా రహితమైన ప్రకటన ఇచ్చారు. ఈ ఆరోపణల్లో ఏ మాత్రం వాస్తవం లేదు. హర్యానా ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచి పెట్టదు’ అని వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్ పై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని నొక్కి చెప్పారు.
ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఫిర్యాదు పంపిందని, సోనిపట్‌లోని చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు (సీజెఎం)లో డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సెక్షన్ల కింద కేసు దాఖలు చేయనున్నట్టు అధికారులు తెలిపారు. కాగా, ఇటీవల కేజ్రీవాల్ మాట్లాడుతూ.. హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం ఢిల్లీకి సరఫరా చేస్తున్న యమునా నీటిలో విషం కలుపుతోందని ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగానే ఈ చర్యలకు పాల్పడుతోందని పరిమితి కంటే 700 రెట్లు ఎక్కువ అమ్మోనియా కలుపుతోందని వ్యాఖ్యానించారు. ఢిల్లీ ఎన్నికల వేళ ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది. కేజ్రీవాల్‌పై బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలోనే హర్యానా ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతోంది.
యమునా నీళ్లు తాగిన హర్యానా సీఎం
యమునా నది జలాలపై వివాదం కొనసాగుతుండగానే హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైనీ (Nayab singh sainy) ఢిల్లీలోని పల్లా గ్రామంలో యమునా నది నీటిని తాగారు. అనంతరం ఆయన కేజ్రీవాల్‌పై మండిపడ్డారు. కేజ్రీవాల్ తన రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల్లో భయాందోళనలు సృష్టించడం దురదృష్టకరమని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం విషం కలిపిందనడంలో ఏ మాత్రం నిజం లేదన్నారు. హర్యానా ప్రజలకు ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.