ఆ సమస్యను వెంటనే పరిష్కరించండి.. మోదీకి కేజ్రీవాల్ విజ్ఞప్తి

by Javid Pasha |   ( Updated:2022-09-08 05:03:02.0  )
ఆ సమస్యను వెంటనే పరిష్కరించండి.. మోదీకి కేజ్రీవాల్ విజ్ఞప్తి
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా త్వరలో ఎన్నికలు రానున్న రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా పంజాబ్, హర్యానా మధ్య ఉన్న నదీ జలాల సమస్యలపై మాట్లాడారు. గత కొన్ని దశాబ్దాలుగా పరిష్కార విషయంలో వాయిదాలు పడుతున్న పంజాబ్, హర్యానాల మధ్య ఉన్న సట్లేజ్, యమున లింక్ విషయంలో ఉన్న నది జలాల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కేజ్రీవాల్ కోరారు. అయితే పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మన్‌తో కలిసి హర్యానా వెళ్లిన కేజ్రీవాల్ తాజాగా విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్బంగానే కేజ్రీవాల్ తన మేక్ ఇన్ ఇండియా నెం.1 క్యాంపెయిన్‌ను ప్రారంభించారు. 'సట్లెజ్, యమున లింక్ కెనాల్ ఇరు రాష్ట్రాలకు చాలా ముఖ్యమైన సమస్య. ఈ సమస్యపై నీచ రాజకీయాలు జరుగుతున్నాయి. దీనిపై ఇరు రాష్ట్రాలు గొడవ పడకూడదు' అని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సమస్యకు వెంటనే పరిష్కరించాలని ప్రధాని మోదీని కోరారు.

Also Read : రష్యాతో ఇంధన సహకారాన్ని బలోపేతం చేసుకోవాలి.. మోడీ

Advertisement

Next Story

Most Viewed