వర్చువల్ గా కాశీ విశ్వనాథుడి దర్శనం..!

by Shamantha N |
వర్చువల్ గా కాశీ విశ్వనాథుడి దర్శనం..!
X

దిశ, నేషనల్ బ్యూరో: కాశీ విశ్వనాథుడి ఐదు ప్రహార్ల హారతి చూడాలనుకునే భక్తుల కోసం శుభవార్త వచ్చేసింది. భారీ రద్దీ, క్యూలైన్లలో నిలబడకుండా ఉండేందుకు ఆలయ కమిటీ డిజిటల్ దర్శనాన్ని అందుబాటులోకి తెచ్చింది. కాశీ విశ్వనాథ్ ధామ్‌లో తొలిసారిగా త్రీడీ- వీఆర్ సాంకేతికతతో హారతి, పూజలను భక్తులకు కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. దీనికోసం ఆలయ నిర్వహాకులు'TECHXR' సంస్థను సంప్రదించారు. భక్తుల కోసం త్రీడీ- వీఆర్ దర్శనాన్ని ఆ సంస్థ అందుబాటులోకి తెచ్చింది. కేవలం 11 నిమిషాల 48 సెకన్లలోపు 'దుర్లభ్ దర్శన్ కేంద్రం'లో భోలేనాథుడి ఐదు ప్రహర్ల హారతి చూడవచ్చు. ప్రస్తుతం ట్రయల్స్ ప్రారంభించినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి విశ్వభూషణ్ మిశ్రా తెలిపారు. ఫలితాలు బాగుంటే ఆ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని పూర్తిస్థాయిలో ఈ సేవలు అందుబాటులోకి తెస్తామన్నారు. వర్చువల్ గా హారతిని తిలకించిన కొందరు భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. హారితి సేవలో స్వయంగా పాల్గొన్నట్లుగా అన్పించిందన్నారు.

Advertisement

Next Story

Most Viewed