- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతులపై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కర్ణాటక మంత్రి
దిశ, వెబ్ డెస్క్ : రైతులపై కర్ణాటక మంత్రి శివానంద మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం రుణాలను మాఫీ చేస్తుండడంతో రైతులు ప్రతి ఏటా కరువును కోరుకుంటున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బెళగావి లో జరిగిన సమావేశంలో పాల్గొన్న మంత్రి రైతుల రుణ మాఫీల గురించి ప్రస్తావిస్తూ... రైతులకు కరెంట్, నీరు ఉచితంగా లభిస్తున్నాయి. చాలా మంది ముఖ్యమంత్రులు రాష్ట్రంలో వ్యవసాయరంగ విస్తరణకు తోడ్పడ్డారు. అయితే ప్రతి ఏటా కరువు రావాలని రైతులు కోరుకుంటున్నారు. అలా కోరుకోవడం సరికాదని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో రాష్ట్ర రాజకీయాలు హిటేక్కాయి. అయితే గతంలో సైతం మంత్రి రైతుల ఆత్మహత్యపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆత్మహత్యకు పాల్పడిన రైతుల కుటుంబాలకు నష్టపరిహారాన్ని పెంచిన తర్వాత రాష్ట్రంలో రైతుల మరణాలు గణనీయంగా పెరిగాయి అంటూ వివాదంలో చిక్కారు.