కార్యకర్త చెంప చెల్లుమనిపించిన కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య

by Javid Pasha |   ( Updated:2023-03-24 12:27:04.0  )
కార్యకర్త చెంప చెల్లుమనిపించిన కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య
X

దిశ, వెబ్ డెస్క్: కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య మరోసారి వార్తల్లోకెక్కారు. తనను కలవడానికి వచ్బిన ఓ కార్యకర్త పట్ల ఆయన దురుసుగా ప్రవర్తించారు. బెంగళూరులోని సిద్ధరామయ్య నివాసానికి ఆయనను కలవడానికి పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చారు. ఈ క్రమంలోనే సిద్ధరామయ్య పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతున్నారు. అయితే ఆ సమయంలో ఓ కార్యకర్త ఆయనకు సమీపంగా వచ్చి ఏదో మాట్లాడటానికి ప్రయత్నించాడు.

అయితే సిద్ధరామయ్య ఆ వ్యక్తి చెంపచెల్లుమనిపించారు. పార్టీ కార్యకర్తను కొడుతున్న ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదేం పద్ధతి సిద్ధరామయ్య అంటూ నెటిజన్లు ఆయనను ప్రశ్నిస్తున్నారు. కాగా సిద్ధరామయ్య 2013 నుంచి 2018 వరకు కాంగ్రెస్ పార్టీ తరఫున కర్ణాటక సీఎంగా పని చేశారు.

Advertisement

Next Story