- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Karnataka: లోక్‌సభ ఎన్నికల వేళ బీజేపీకి బిగ్ షాక్.. కాంగ్రెస్‌లో చేరబోతున్న మాజీ ముఖ్యమంత్రి
దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఇప్పటికే ఆయా పార్టీల అధినేతలు తమ అభ్యర్థులను కూడా ప్రకటించి ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ఈ క్రమంలో ఆయా రాష్ట్రాల్లో నేతల చేరికల పర్వం మొదలైంది. ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడిన నాయకులంతా తమ ప్రత్యర్థి పార్టీల్లో చేరుతూ రాజకీయాన్ని హీటెక్కిస్తున్నా. ఇదే తరుణంలో తాజాగా కర్నాటక మాజీ ముఖ్యమంత్రి సదానంద గౌడ పార్టీ మారేందుకు సిద్ధమతున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల బీజేపీ ప్రకటించిన లోక్‌సభ అభ్యర్థుల జాబితాలో సదానంద గౌడ పేరు లేకపోవడంతో ఆయన ఓకింత అసహనానికి లోనయ్యారు.
ఈ క్రమంలో తన ముఖ్య నాయకులు, కార్యకర్తలతో చర్చించి త్వరలోనే భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తానని వెల్లడించారు. కాగా, బెంగళూరు నార్త్ నియోజకవర్గం నుంచి సదానంద గౌడ టికెట్ ఆశించిన ఆయనకు నిరాశ ఎదురైంది. దీంతో ఆయన కాంగ్రెస్‌లో చేరొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. తన తదుపరి రాజకీయ కార్యాచరణను మంగళవారం ఉదయం ప్రకటిస్తానని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశంపై కర్ణాటక ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.