బిగ్ బ్రేకింగ్: కర్నాటక ఎన్నికల కౌంటింగ్ స్టార్ట్.. దేశ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ

by Satheesh |   ( Updated:2023-05-13 05:58:15.0  )
బిగ్ బ్రేకింగ్: కర్నాటక ఎన్నికల కౌంటింగ్ స్టార్ట్.. దేశ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోన్న కర్నాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఎట్టకేలకు ప్రారంభం అయ్యింది. అధికారులు కౌంటింగ్‌కు సర్వం సిద్ధం చేశారు. ఉదయం ఎనిమిది గంటల నుండి ఎన్నికల కౌంటింగ్ మొదలు అయ్యింది. మొత్తం 36 కేంద్రాల్లో కౌంటింగ్ ప్రారంభించిన అధికారులు.. మొదటగా ఓట్ ఫ్రమ్ హోమ్, పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. కర్నాటకలోని 224 నియోజకవర్గాల్లో జరగనున్న కౌంటింగ్‌పై ఇవాళ మధ్యాహ్నం వరకు తుది ఫలితాలపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఎన్నికల కౌంటింగ్ ఉండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా ముందు జాగ్రత్తల భాగంగా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. సమస్యాత్మక ప్రాంతాలపై పోలీసులు డేగ కన్ను వేశారు. ఇందులో భాగంగా బెంగళూరులో ఇవాళ ఉదయం 6 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు 144 సెక్షన్ విధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక, గెలుపుపై అధికార బీజేపీ, కాంగ్రెస్ దీమా వ్యక్తం చేస్తున్నాయి. 224 నియోజకవర్గాలు ఉన్న కర్నాటకలో అధికారం చేపట్టాలంటే మ్యాజిక్ ఫిగర్ 113 సీట్లు అవసరం. కర్నాటక ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొనగా.. మరికొన్ని గంటల్లో పొలిటికల్ సస్పెన్స్‌కు తెరపడనుంది.

Also Read...

కర్నాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేసేది మేమే: కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు

Advertisement

Next Story

Most Viewed