Donald Trump: ట్రంప్ విక్టరీ.. ఓటమిని అంగీకరించని కమలా హారిస్

by Mahesh Kanagandla |
Donald Trump: ట్రంప్ విక్టరీ.. ఓటమిని అంగీకరించని కమలా హారిస్
X

దిశ, నేషనల్ బ్యూరో : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ మాత్రం ఇప్పటికి ఓటమిని అంగీకరించలేదు. రానున్న రోజుల్లో సైతం కమలా హారిస్ అమెరికా పాలిటిక్స్‌లో కీలక పాత్ర పోషించనున్నారు. ఇక, అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గెలిచినట్లు వైస్ ప్రెసిడెంట్ ప్రకటించాల్సి ఉంది. అమెరికా రాజ్యాంగం ప్రకారం ఉపాధ్యక్షుడు సెనేట్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తారు. ప్రిసైడింగ్ ఆఫీసర్‌ బాధ్యతలు నిర్వహించడంతో పాటు అధ్యక్ష ఎన్నికల్లో వేసిన ఎలక్టోరల్ బ్యాలెట్లను స్వీకరించడం, లెక్కించడం వంటి అంశాలను పర్యవేక్షిస్తారు. ఉపాధ్యక్షుడు బుధవారం రాత్రి ఇవ్వాల్సిన స్పీచ్‌ను క్యాన్సిల్ చేసుకున్నారు. ఇంకా ఓట్లను లెక్కించాల్సి ఉందని ప్రకటించారు. ఇంకా కొన్ని రాష్ట్రాలలో ఫలితాలు వెలువడలేదని సెడ్రిక్ రిచ్‌మండ్ అన్నారు. రాత్రంతా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుందని.. ప్రతి ఒక్క ఓటును లెక్కిస్తామని స్పష్టం చేశారు. అందుకే ఈ రోజు తను మాట్లాడటం లేదని.. రేపు ఆమె ఫలితాన్ని వెల్లడిస్తారని తెలిపారు. ట్రంప్ మాత్రం తన విజయం సందర్భంగా ఇచ్చిన స్పీచ్ లో మాట్లాడుతూ.. అమెరికాకు స్వర్ణయుగం వచ్చిందని అభివర్ణించారు. అమెరికాను మళ్లీ గొప్పగా చేసేందుకు ఇదో అద్భుతమైన అవకాశమని ట్రంప్ అన్నారు.

Advertisement

Next Story