INDIA Bloc : ఆ హైకోర్టు జడ్జిపై పార్లమెంటులో అభిశంసన తీర్మానం.. ఎందుకంటే..

by Hajipasha |
INDIA Bloc : ఆ హైకోర్టు జడ్జిపై పార్లమెంటులో అభిశంసన తీర్మానం.. ఎందుకంటే..
X

దిశ, నేషనల్ బ్యూరో : ఇటీవలే ముస్లింలకు వ్యతిరేకంగా అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై విపక్ష ఇండియా కూటమి(INDIA Bloc) సీరియస్ అయింది. ‘‘ఇది హిందుస్తాన్.. ఇక్కడ మెజారిటీ ప్రజల అభిమతమే చెల్లుతుంది’’ అంటూ ఆయన చేసిన కామెంట్స్‌ను తీవ్రంగా ఖండించింది. జడ్జీలు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే న్యాయవ్యవస్థకు మచ్చ వస్తుందని వాదిస్తున్న ఇండియా కూటమి.. సదరు జడ్జీపై పార్లమెంటులో అభిశంసన తీర్మానాన్ని(Judge impeachment) ప్రవేశపెట్టేందుకు ఎంపీల సంతకాల సేకరణను మొదలుపెట్టింది. ఇప్పటికే రాజ్యసభలో 38 మంది ఎంపీలు, లోక్‌సభలో 50 మంది ఎంపీలు సంతకాలు చేసినట్లు తెలిసింది.

అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్‌పై లోక్‌సభ, రాజ్యసభ రెండింటిలోనూ అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. రాజ్యసభలో అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు కనీసం 50 మంది ఎంపీల సంతకాలు కావాలి. లోక్‌సభలో కనీసం 100 మంది ఎంపీల సంతకాలు ఉంటేనే అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు అనుమతిస్తారు. ఇండియా కూటమికి ప్రస్తుతం లోక్‌సభలో 237 మంది ఎంపీలు, రాజ్యసభలో 86 మంది ఎంపీల బలం ఉంది. కాగా, ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లో ఈనెల 8న విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) నిర్వహించిన ఓ కార్యక్రమంలో హైకోర్టు జడ్జి జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ ప్రసంగించారు.‘‘ఇది హిందుస్తాన్.. ఇక్కడ మెజారిటీ ప్రజల అభిమతమే అమలవుతుంది’’ అని వ్యాఖ్యానించారు.

Advertisement

Next Story

Most Viewed