- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రధాని మోడీ అవినీతిని అంతం చేయాలని చూస్తున్నారు: జేపీ నడ్డా
దిశ, నేషనల్ బ్యూరో: ఒకవైపు ప్రధాని మోడీ దేశంలో అవినీతిని అంతమొందించేందుకు తీవ్రంగా శ్రమిస్తుంటే, ఇండియా కూటమి నేతలు మాత్రం అవినీతిపరులను రక్షించడంలో ఆసక్తి చూపుతున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదివారం అన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వంటి నేతలు జైలులో ఉండగా, సోనియాగాంధీ, ఆమె కుమారుడు రాహుల్‌తో సహా కాంగ్రెస్ నేతలు బెయిల్‌పై ఉన్నారని, అవినీతిని అంతం చేస్తానని ప్రధాని నరేంద్ర మోడీ అంటుంటే, అవినీతిపరులను రక్షించండి అని ఇండియా కూటమి నేతలు అంటున్నారు. అది వారి వర్కింగ్ స్టైల్ అని తమిళనాడులో జరిగిన ర్యాలీలో నడ్డా అన్నారు.
తమిళనాడులో వంశపారంపర్యంగా డీఎంకే, దాని మిత్రపక్షం కాంగ్రెస్ అవినీతికి పాల్పడుతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రతిపక్ష నాయకులు కేవలం కుటుంబ పార్టీలేనని, తమ వంశాన్ని, కుటుంబ పార్టీలను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. అవినీతి రహిత భారత్ కోసం డీఎంకేను, దాని మిత్రపక్షాలను తరిమికొట్టాలని ఆయన అన్నారు. తమిళ సంస్కృతిని పునరుజ్జీవింపజేసేందుకు మేం కట్టుబడి ఉంటే, కూటమి నేతలు సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. దానిని నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని నడ్డా తెలిపారు. ఇక్కడ జరిగిన సమావేశంలో ప్రజల ఉత్సాహం, చురుకుదనం చూసి వారు బీజేపీ అభ్యర్థులను పార్లమెంట్‌కు పంపుతారనే నమ్మకం తనకు ఉందని అన్నారు.
కేంద్రం తమిళనాడుకు అభివృద్ధికి కట్టుబడి ఉంది. దీనికోసం ఈ రాష్ట్రానికి భారీ కేటాయింపులు చేసింది. ఆరోగ్య మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి జాతీయ ఆరోగ్య మిషన్ కింద రూ. 1,650 కోట్లు, గ్రామీణ రోడ్ల అభివృద్ధికి రూ. 613 కోట్లు, తాగునీటికి రూ. 872 కోట్లు, గ్రామీణాభివృద్ధికి రూ. 10,346 కోట్లు కేటాయించారు, రాష్ట్రానికి రైల్వే బడ్జెట్‌ను 7 రెట్లు పెంచారు. ఒకవైపు దేశం, తమిళనాడు కోసం ప్రధానమంత్రి పనిచేస్తుంటే, మరోవైపు పరివార్ బచావో, రాజవంశం బచావో, కుటుంబాన్ని రక్షించండి అని అవినీతి పార్టీల కూటమి అంటుందని నడ్డా ర్యాలీలో అన్నారు.