పాకిస్థాన్ పై సంచలన ఆరోపణలు చేసిన జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్

by M.Rajitha |
పాకిస్థాన్ పై సంచలన ఆరోపణలు చేసిన జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్
X

దిశ, వెబ్ డెస్క్ : ఇటీవల దేశం మీద ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో తరచుగా జరుగుతున్న ఉగ్రదాడులకు పరోక్ష కారణం పాకిస్థాన్ అన్నారు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా. దేశంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు విదేశీ ఉగ్రవాదులను భారత్ మీదికి పాకిస్థాన్ ఉసిగొల్పుతుందని ఆరోపించారు. పాక్ కుట్రలను తిప్పికొట్టేందుకు భద్రతాబలగాలు, ప్రభుత్వం ఒక వ్యూహాన్ని రచించామని తెలిపారు. రానున్న మూడు నెలల్లో స్థానిక పరిస్థితుల్లో పెనుమార్పు రానుందని జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సిన్హా పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని కూకటి వేళ్ళతో నిర్మూలించేందుకు భారత్ కృషి చేస్తోందని, ఇందుకోసం త్వరలోనే పెద్ద ఎత్తున బలగాలను రంగంలోకి దించుతోందని అన్నారు. ఆర్మీ, సీఆర్పీఎఫ్, పోలీస్ సిబ్బందిని మోహరిస్తున్నారని, ఉగ్రదాడులను కట్టడి చేయడమే వాటి ఏకైక లక్ష్యం అని తెలియ జేశారు.

Next Story

Most Viewed