జేఈఈ మెయిన్స్ పరీక్షలు.. ఎన్టీఏ రెడ్ అలర్ట్

by Hajipasha |
జేఈఈ మెయిన్స్ పరీక్షలు.. ఎన్టీఏ రెడ్ అలర్ట్
X

దిశ, నేషనల్ బ్యూరో : జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ - మెయిన్ ( జేఈఈ-మెయిన్) పేపర్ 1 పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. ఇవి ఈనెల 9 వరకు కొనసాగనుండగా.. పేపర్ 2 పరీక్షను ఏప్రిల్ 12న నిర్వహిస్తారు. ఈనేపథ్యంలో అభ్యర్థులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) అలర్ట్ జారీ చేసింది. పరీక్షల అనంతరం కూడా ఎగ్జామ్ సెంటర్ల వీడియో డేటాను విశ్లేషిస్తామని, ఎవరైనా మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడినట్లు తేలితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. భారీ జరిమానాలు విధించడం, ఇకపై పరీక్ష రాయకుండా నిషేధం అమల్లోకి తేవడం వంటి యాక్షన్స్ ఉంటాయని ఎన్టీఏ తెలిపింది. అభ్యర్థుల రిమోట్ బయోమెట్రిక్ మ్యాచింగ్ కోసం ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ టెక్నాలజీని వాడుతున్నట్లు పేర్కొంది. పరీక్ష రాస్తున్న అభ్యర్థి మధ్యలో టాయిలెట్ లేదా వాష్ రూంకు వెళ్లినా.. ఎగ్జామ్ హాల్‌లోకి తిరిగొచ్చే టైంలో తప్పనిసరిగా బయోమెట్రిక్ హాజరును మరోసారి సమర్పించాలనే నిబంధనను అమల్లోకి తెచ్చినట్లు ఎన్టీఏ వెల్లడించింది. ఇంతకుముందు జనవరిలో జరిగిన జేఈఈ-మెయిన్ పరీక్షలో నలుగురు అభ్యర్థులు అవకతవకలకు పాల్పడుతూ దొరికిపోయారు.

Advertisement

Next Story

Most Viewed