కర్ణాటకలో కీలక పరిణామం.. ఎన్డీయేలో చేరిన కుమారస్వామి..

by Vinod kumar |
కర్ణాటకలో కీలక పరిణామం.. ఎన్డీయేలో చేరిన కుమారస్వామి..
X

న్యూఢిల్లీ : మాజీ ప్రధాని దేవెగౌడ సారథ్యంలోని జేడీఎస్ పార్టీ ఎన్డీయే కూటమిలో చేరింది. శుక్రవారం ఉదయం ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో దేవెగౌడ కుమారుడు, జేడీఎస్ నేత కుమారస్వామి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, గోవా సీఎం ప్రమోద్ సావంత్ కూడా పాల్గొన్నారు. ఈ మీటింగ్ ముగిసిన అనంతరం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ట్వీట్ చేస్తూ.. ‘‘ఎన్డీయే కూటమిలో భాగం కావాలని జేడీఎస్ నిర్ణయించుకున్నందుకు నేను సంతోషిస్తున్నాను. మా కూటమిలోకి వారిని హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం.

జేడీఎస్ చేరికతో ఎన్డీయే విజన్‌కు.. ప్రధానమంత్రి మోడీ న్యూ ఇండియా, స్ట్రాంగ్ ఇండియా ఆశయాలకు బలం చేకూరుతుంది’’ అని పేర్కొన్నారు. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ప్రధాని మోడీ చేస్తున్న అభివృద్ధి పనుల తీరును గుర్తించే ఏ పార్టీ కూడా ఎన్డీయేలో చేరేందుకు నో చెప్పదు. ఎన్డీయేలోకి జేడీఎస్‌ను స్వాగతిస్తున్నా.. వచ్చే ఎన్నికల్లో కర్ణాటకలోని అన్ని లోక్‌సభ స్థానాలను మేం గెలవబోతున్నాం’’ అని తెలిపారు. మొత్తం 28 లోక్ సభ నియోజకవర్గాలు ఉన్న కర్ణాటకలో.. జేడీఎస్‌కు నాలుగు లోక్‌సభ స్థానాలను పొత్తులో భాగంగా కేటాయించనున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed