- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ప్లీజ్.. ఎక్కువ మంది పిల్లల్ని కనండి.. అమెరికా సర్కార్‌లో ఆంధ్రా అల్లుడి నిర్ణయం

దిశ, వెబ్‌డెస్క్: JD Vance: అమెరికాలో పిల్లల సంఖ్య పెరగాలని ఆంధ్రా అల్లుడు, దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్(J.D. Vance) పేర్కొన్నారు. తాజాగా నిర్వహించిన యాంటీ అబార్షన్ ర్యాలీ(anti-abortion rally)లో వాన్స్ పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. అమెరికాలో పిల్లల సంఖ్య పెరగాలని.. అందుకు అమెరికన్లు ఎక్కువ మంది పిల్లలను(America needs more children ) కనాలని తాను కోరుకుంటున్నట్లు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జీవితానికి విలువనిచ్చే సంస్క్రుతిపై ఫోకస్ పెట్టాలని.. కుటుంబాలను ఆదుకోవడానికి, పిల్లలను పెంచడానికి అమెరికా ప్రభుత్వం మరింత సాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అబార్షన్ లను ప్రోత్సహించడం ద్వారా కొన్ని తరాలు భవిష్యత్తును కోల్పోయే ప్రమాదం ఉందన్నారు.
భావితరాలపై ఇప్పటివారికి ఉండాల్సిన బాధ్యతను గుర్తించడంలో ప్రస్తుత సమాజం విఫలం అవుతుందని వాన్స్ ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికాలో పుట్టబోయే బిడ్డలను రక్షించడానికి తమ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందన్నారు. తమ పిల్లలను ఆనందంగా ఈ ప్రపంచంలోకి ఆహ్వానించే యువతను దేశం కోరుకుంటుందని జేడీ వాన్స్ (J.D. Vance)తెలిపారు. దేశ అభివ్రుద్ధిని, జాతీయ ఆదాయాన్ని జీడీపీతో కాకుండా దేశంలో అభివ్రుద్ధి చెందుతున్న, ఆరోగ్యకరమైన కుటుంబాలను ఏర్పాటు చేసుకుకుంటున్న వ్యక్తుల సామర్థ్యం ద్వారా కావాలని వాన్స్ సూచించారు.
అబార్షన్ల గురించి మాట్లాడుతూ ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. అబార్షన్స్ పై నిషేధాన్ని తాను పూర్తి అనుకూలం కాదని..దానికి తాను ఎప్పటికీ మద్దతు ఇవ్వను అన్నారు. ఎనిమిది, తొమ్మిది నెలల్లో అబార్సన్ ఎలా చేస్తారంటూ ప్రశ్నించారు. అది ప్రమాదకరం కాబట్టి నెలలు నిండిన తర్వాత చేసే అబార్షన్స్ ను తాను పోత్సహించనని స్పష్టం చేశారు.