కేజ్రీవాల్ పేరుని తెరపైకి తెచ్చిన పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

by Shamantha N |
కేజ్రీవాల్ పేరుని తెరపైకి తెచ్చిన పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
X

దిశ, నేషనల్ బ్యూరో: పాక్ మాజీ ప్రధాని అనూహ్యంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేరుని తెరపైకి తెచ్చారు. ఈ విషయం కాస్తా.. చర్చనీయాంశంగా మారింది. ఓ కేసులో పాకిస్థాన్ సుప్రీంకోర్టు ఎదుట హాజరైన ఇమ్రాన్ ఖాన్ కేజ్రీవాల్ గురించి మాట్లాడారు. భారత్ లో లోక్ సభ ఎన్నికల కోసం కేజ్రీవాల్ కు బెయిల్ దక్కిందని వ్యాఖ్యానించారు. కానీ, ఇక్కడ తాను మాత్రం అణచివేతకు గురవుతున్నాని.. జైళ్లో తనతో దారుణంగా వ్యవహరిస్తున్నారని పేర్కొంది.

సుప్రీం తీర్పుపై ఇమ్రాన్ ఖాన్ అసంతృప్తి

‘నేషనల్‌ అకౌంటబిలిటీ ఆర్డినెన్స్‌’లో సవరణలకు సంబంధించిన కేసులో విచారణకు ఇమ్రాన్ ఖాన్ సుప్రీంకోర్టుకు హాజరయ్యారు. 2022లో అధికారం పోయినప్పట్నుంచి తాను ఎదుర్కొన్న పరిస్థితుల గురించి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 8న జరిగిన పాక్ సార్వత్రిక ఎన్నికలకు తనను దూరం చేసేందుకే 5 రోజుల్లోనే ఓ కేసులో దోషిగా తేల్చారన్నారు. కేసు విచారణను లైవ్ టెలికాస్టింగ్ చేయాలన్న వినతిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ తీర్పుపైనా ఇమ్రాన్ అసహనం వ్యక్తం చేశారు. కోర్టులోపాలిటిక్స్ మాట్లాడనని తీర్పు పేర్కొన్నారని ఇమ్రాన్ ఖాన్ నిరాశ వ్యక్తం చేశారు. అసలు తానే మాట్లాడానని ప్రశ్నించారు. అయితే.. ఈ తీర్పుపై ఎవరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని జడ్జి పేర్కొన్నారు. దీనిపై రివ్యూ పిటిషన్ వేయొచ్చని సూచించారు. పెండింగ్ అంశాలపైనే కోర్టులో మాట్లాడాలని జడ్జి ఘాటుగా స్పందించారు.

Advertisement

Next Story