- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నేడే నింగిలోకి ‘నాటీ బోయ్’.. ఏమిటది ?
దిశ, నేషనల్ బ్యూరో : ఈ ఏడాది రెండో ఉపగ్రహ ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. వాతావరణ అధ్యయనానికి సంబంధించిన ‘ఇన్‌శాట్ 3డీఎస్’ ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వీ -ఎఫ్14 రాకెట్ ద్వారా నిర్దిష్ట కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. జీఎస్ఎల్వీ -ఎఫ్14 రాకెట్‌ను ‘నాటీ బోయ్’ అని పిలుస్తుంటారు. ఇవాళ (శనివారం) సాయంత్రం 5 గంటల 35 నిమిషాలకు జరిగే ఈ ప్రయోగానికి తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ వేదికగా నిలువనుంది. దీనికి సంబంధించిన కౌంట్‌డౌన్ శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల 5 నిమిషాలకు ప్రారంభమైంది. ప్రకృతి విపత్తుల సమయంలో ముందస్తుగా సమాచారాన్ని సేకరించే అత్యాధునిక సాంకేతిక వ్యవస్థతో కూడిన 19 పేలోడ్‌లను కూడా ఇన్‌శాట్ 3డీఎస్ ఉపగ్రహంలో అమర్చారు. మెరుగైన రీతిలో వాతావరణ అంచనాలతో పాటు భూమి, సముద్ర ఉపరితలాల పర్యవేక్షణకు ఈ శాటిలైట్ ఉపయోగపడుతుంది. కేంద్ర ఎర్త్ సైన్సెస్ శాఖ ఈ ప్రయోగానికి అవసరమైన నిధులను ఇస్రోకు సమకూర్చింది. భారత వాతావరణ విభాగం, నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్‌కాస్టింగ్ విభాగాలు వాతావరణ అంచనాల కోసం ఇన్‌శాట్ 3డీఎస్ ఉపగ్రహం పంపించే సమాచారాన్ని ఉపయోగించుకోనున్నాయి.