Israel-Lebanon: లెబనాన్ పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు

by Shamantha N |   ( Updated:2024-11-02 05:04:10.0  )
Israel-Lebanon: లెబనాన్ పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు
X

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఇజ్రాయెల్‌- హెజ్‌బొల్లాల(Israel-Lebanon) మధ్య పరస్పర దాడులు పెరిగిపోయాయి. మరోసారి లెబనాన్(Lebanon) పై ఇజ్రాయెల్ భీకర దాడికి పాల్పడింది. ఈశాన్య లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు చేసింది. బెకా వ్యాలీపై ఇజ్రాయెల్‌ జరిపిన వైమానిక దాడుల్లో 52 మంది మృతి చెందినట్లు లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఈ దాడుల సమయంలో ఆ ప్రాంతంలోని ప్రజలు తప్పించుకునేందుకు ప్రయత్నించినట్లు అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో 52 మంది మృతి చెందగా.. 72 మంది గాయపడ్డారు.

దక్షిణ బీరుట్ లో దాడులు

మరోవైపు దాడుల కారణంగా దక్షిణ బీరుట్‌లోని దహియేలో కూడా టెల్ అవీవ్ దాడులకు పాల్పడింది. దీంతో, పలు భవనాలు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. అయితే, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఇదిలాఉండగా.. ఇజ్రాయెల్‌పై హెజ్‌బొల్లా రాకెట్‌ దాడులు చేసింది. ఈ దాడుల్లో దాదాపు 11 మంది గాయపడినట్లు స్థానిక మీడియా తెలిపింది. మరోవైపు, హమాస్‌కు చెందిన సీనియర్‌ అధికారి ఇజ్‌ అల్‌ దిన్‌ కసబ్‌ను మట్టుబెట్టినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(IDF) పేర్కొంది. గాజా స్ట్రిప్‌లోని ఇతర సమూహాలను కసబ్‌ సమన్వయం చేయడానికి బాధ్యత వహిస్తుంటాడని తెలిపింది. కసబ్‌ మరణానికి పాలస్తీనా అధికారులు సంతాపం తెలిపారు. ఎన్‌క్లేవ్‌లో తమ కారుపై టెల్‌అవీవ్‌ జరిపిన దాడుల్లో అమాన్‌అయేష్‌ అనే హమాస్‌ అధికారితో పాటు కసబ్‌ మృతి చెందినట్లు వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed