- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్లీనెస్ట్ సిటీస్‌గా ఇండోర్, సూరత్
దిశ, నేషనల్ బ్యూరో: దేశంలోనే పరిశుభ్రమైన నగరాలుగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్, గుజరాత్‌లోని సూరత్‌లు నిలిచాయి. ఈ మేరకు ‘స్వచ్ఛ్ సర్వేక్షణ్ అవార్డ్స్ 2023’ను కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. గతేడాది మూడో స్థానంలో నిలిచిన నవీ ముంబై తన స్థానాన్ని కాపాడుకోగా.. నాలుగో స్థానంలో ఆంద్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, తెలంగాణ రాజధాని హైదరాబాద్ తొమ్మిదో ప్లేసులో ఉంది. ఇండోర్ అత్యంత పరిశుభ్రమైన నగరంగా గుర్తింపు పొందడం ఇది ఏడోసారి కావడం గమనార్హం. ఇక, లక్ష కంటే తక్కువ జనాభా ఉన్న నగరాల్లో మహారాష్ట్రలోని సాస్వాద్ అత్యంత క్లీనెస్ట్ నగరంగా నిలిచింది. ఈ విభాగంలో ఛత్తీస్‌గఢ్‌లోని పటాన్, మహారాష్ట్రలోని లోనావాలా వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. అలాగే క్లీనెస్ట్ కంటోన్మెంట్ బోర్డుల విభాగంలో మధ్యప్రదేశ్‌లోని మోవ్ కంటోన్మెంట్ బోర్డ్ మొదటి స్థానం పొందింది. కాగా, స్వచ్చ సర్వేక్షన్ సర్వేను కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2016 నుంచి నిర్వహిస్తుంది. మొదటి సారి 73 ప్రధాన నగరాలకు పరిమితమైన సర్వే ప్రస్తుతం గణనీయంగా విస్తరించింది. 2023లో సుమారు 4,447 పట్టణ స్థానిక సంస్థలు స్వచ్ఛ సర్వేక్షణ్ పాల్గొన్నాయి. పట్టణాలు, నగరాలను నివసించడానికి ఉత్తమమైన ప్రదేశాలుగా మార్చడానికి పౌరుల భాగస్వామ్యాన్ని పెంచడమే సర్వే లక్ష్యం.