భారత జీడీపీ వృద్ధి రేటు.. 5.4% కు పడిపోయింది: రాహుల్ గాంధీ

by Mahesh |   ( Updated:2024-12-02 12:36:50.0  )
భారత జీడీపీ వృద్ధి రేటు.. 5.4% కు పడిపోయింది: రాహుల్ గాంధీ
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా కీలక ట్వీట్ చేశారు. భారతదేశం GDP వృద్ధి రేటు రెండు సంవత్సరాలలో కనిష్టమైన 5.4% కు పడిపోయిందని రాసుకొచ్చారు. "స్పష్టమైన విషయం ఏంటంటే - భారత ఆర్థికవ్యవస్థ అభివృద్ధి చెందడానికి, అది కేవలం కొద్ది మంది అంబానీలు మాత్రమే లాభపడుతుంటే, రైతులు, కార్మికులు, మధ్యతరగతి, పేదలు అనేక ఆర్థిక సమస్యలతో పోరాడుతున్నప్పుడు సాధ్యం కాదని రాహుల్ రాసుకొచ్చారు. దీంతో పాటుగా.. ఈ వాస్తవాలను ఒకసారి పరిశీలించండి, పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉందో చూడండి ఈ క్రింది అంశాలను లేవనెత్తారు.

* స్వల్పకాలిక ధరల పెరుగుదల 14 నెలల గరిష్ట స్థాయిగా 6.21% కు చేరుకుంది. గత ఏడాది అక్టోబర్‌తో పోలిస్తే ఈ ఏడాది ఆలుగడ్డ, ఉల్లి ధరలు సుమారు 50% పెరిగాయి.

*రూపాయి 84.50 వద్ద కనిష్ట స్థాయికి చేరుకుంది.

*నిరుద్యోగం ఇప్పటికే 45 సంవత్సరాల కంటే అధిక నిరుద్యోగత స్థాయిని నమోదు చేసింది.

* గత 5 సంవత్సరాలలో కార్మికులు, ఉద్యోగులు, చిన్న వ్యాపారుల ఆదాయం సరిగా రావడం లేదు.

*ఆదాయం తగ్గడంతో డిమాండ్‌లో కూడా తగ్గుదల కనిపిస్తోంది. 10 లక్షల కంటే తక్కువ ధరల, అమ్మకంలో వాటా 50% కంటే తక్కువగా మారింది. ఇది 2018-19 లో 80% గా ఉన్నది.

* తక్కువ ధరల ఇళ్ల మొత్తం అమ్మకాల వాటా 22% కు పడిపోయింది, ఇది గత సంవత్సరం 38% ఉంది.

*FMCG ఉత్పత్తుల డిమాండ్ ఇప్పటికే తగ్గుతోంది.

* కార్పొరేట్ పన్ను వాటా గత 10 సంవత్సరాలలో 7% తగ్గింది. అలాగే ఆదాయ పన్ను 11% పెరిగింది.

* నోట్ బందీ, GST ప్రభావంతో ఆర్థిక వ్యవస్థలో తయారీ రంగం వాటా 50 సంవత్సరాలలో కనిష్టం 13% కు పడిపోయింది. ఈ పరిస్థితుల్లో కొత్త ఉద్యోగ అవకాశాలు ఎలా ఏర్పడతాయి?

*అందుకే, భారత ఆర్థిక వ్యవస్థకు కొత్త ఆలోచన అవసరం. వ్యాపారాల కోసం కొత్త ఒప్పందం దాని ముఖ్య భాగం. అందరికీ సమానంగా ముందుకు పోయే అవకాశం ఇవ్వబడినప్పుడు మాత్రమే మన ఆర్థిక వ్యవస్థ ముందుకు పోతుంది అని రాహుల్ గాంధీ తన ట్వీట్ లో రాసుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed