Independence Day: 2036లో భారత్ లోనే ఒలింపిక్స్ నిర్వహించేలా ప్రయత్నాలు

by Shamantha N |   ( Updated:2024-08-15 07:35:12.0  )
Independence Day: 2036లో భారత్ లోనే ఒలింపిక్స్ నిర్వహించేలా ప్రయత్నాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: గ్లోబల్ ఈవెంట్‌లను నిర్వహించగల సామర్థ్యం భారత్‌కు ఉందని ప్రధాని మోడీ అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆయన ప్రసంగంలో ఒలింపిక్స్ గురించి మాట్లాడారు. 2036లో జరిగే ఒలింపిక్స్‌కు భారత్ లో నిర్వహించేలా కేంద్రప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోందన్నారు. 2036 ఒలింపిక్స్‌ లో అహ్మదాబాద్‌ను ఆతిథ్య నగరంగా ముందంజలో ఉంచామన్నారు. ప్యారిస్ ఒలింపిక్స్ లో పతకాలు గెలిచిన క్రీడాకారులను అభినందించారు. 140 కోట్ల మంది దేశప్రజల తరపున వారికి అభినందనలు తెలిపారు. మరికొద్ది రోజుల్లో పారాలింపిక్స్‌లో పాల్గొనేందుకు భారత్‌ నుంచి భారీ బృందం పారిస్‌కు బయలుదేరనుందని పేర్కొన్నారు. పారాలింపియన్లందరికీ శుభాకాంక్షలు తెలిపారు. గత సెప్టెంబర్ లో జీ 20 సమ్మిట్ ని విజయవంతంగా నిర్వహించామని గుర్తుచేశారు. భారీస్థాయిలో అంతర్జాతీయ ఈవెంట్ ని విజయవంతంగా నిర్వహించడంతో పెద్ద ఈవెంట్లను నిర్వహించే సత్తా భారత్ ప్రపంచదేశాలకు రుజువు చేసిందన్నారు. ఇకపోతే, ఎర్రకోటవద్ద జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఒలింపిక్ క్రీడాకారులు పాల్గొన్నారు. ప్రధాని మోడీ అధికారిక నివాసంలో ఒలింపిక్ క్రీడాకారులు ఆయనతో మధ్యాహ్నం సమావేశం కానున్నారు.

Advertisement

Next Story

Most Viewed