పారిస్ ఒలింపిక్స్ భద్రతకు వెళ్లిన కె-9 యూనిట్‌ను కలిసిన భారత రాయబారి

by S Gopi |
పారిస్ ఒలింపిక్స్ భద్రతకు వెళ్లిన కె-9 యూనిట్‌ను కలిసిన భారత రాయబారి
X

దిశ, నేషనల్ బ్యూరో: ఫ్రాన్స్‌, మొనాకోల భారత రాయబారి జావేద్ అష్రఫ్ సోమవారం పారిస్ ఒలింపిక్స్ 2024 భద్రత కోసం వెళ్లిన భారత్‌కు చెందిన డాగ్ స్క్వాడ్ బృందం కె-9 (కెనైన్) యూనిట్‌ను కలిశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ఎక్స్‌లో ట్వీట్ చేశారు. కె-9 యూనిట్‌తో ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు. ముప్పును ఎదుర్కోవడానికి భద్రతా బృందాలకు సహాయపడే పేలుడు పదార్థాలను గుర్తించేందుకు ఈ డాగ్‌స్క్వాడ్‌ను ఉపయోగిస్తారు. ఈ యూనిట్లు ఫ్రాన్స్ అంతటా విస్తరించి ఉంటాయి. మినిస్ట్రీ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ (ఫ్రాన్స్) ప్రకారం, దాదాపు నలభై విదేశీ సైనిక డాగ్‌స్క్వాడ్ నిర్వహణ బృందాలు ఫ్రెంచ్ కనైన్ ఇన్‌ఫాంట్రీ యూనిట్‌తో పాటు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తాయి. పారిస్ పోలీసు చీఫ్ లారెంట్ నునెజ్ ఈవెంట్‌కు సంబంధించిన భద్రతా సమస్యలను ప్రస్తావించారు. 'మేము తీవ్రవాద ముప్పు గురించి ఆందోళన చెందుతున్నాము. ముఖ్యంగా ఇస్లామిక్ ఉగ్రవాదం పట్ల ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. పర్యావరణవాదులు, వామపక్ష తీవ్రవాదులు, పాలస్తీనా అనుకూల ఉద్యమం నుంచి ఎంతోకొంత ముప్పు కూడా ఉంది' అని మీడియా సమావేశంలో పేర్కొన్నారు.

Advertisement

Next Story