రఫేల్‌ జెట్స్‌లో ఇండియా మిస్సైల్స్!

by Vinod kumar |
రఫేల్‌ జెట్స్‌లో ఇండియా మిస్సైల్స్!
X

న్యూఢిల్లీ : భవిష్యత్తులో ఫ్రాన్స్ నుంచి కొనే రఫేల్‌ యుద్ధ విమానాలు "మేక్ ఇన్ ఇండియా" మిస్సైల్స్‌ను ప్రయోగించగలిగేలా ఉండాలని భారత్‌ భావిస్తోంది. మన ఆర్మీ కోసం దేశంలో తయారు చేసుకున్న స్వదేశీ క్షిపణులను మోసుకెళ్లేందుకు వీలుగా రఫేల్‌ జెట్స్ నిర్మాణంలో మార్పులు చేయించడంపై ఫోకస్ పెట్టింది. దీనిపై రఫేల్‌ జెట్స్ తయారీ సంస్థ డసాల్ట్‌ ఏవియేషన్‌‌కు భారత సర్కారు ప్రతిపాదనలు పంపిందని తెలుస్తోంది. భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) రూపొందించిన ఆస్ట్రా ఎయిర్‌, ఆస్ట్రా మార్క్‌ తదితర క్షిపణులను మన ఆర్మీ ఇప్పటికే వినియోగిస్తోంది. ఈ మిస్సైల్స్‌ను అనుసంధానించే వెసులుబాటు ఉండేలా రఫేల్‌ యుద్ధ విమానాలు అందుబాటులోకి వస్తే బాగుంటుందని ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

స్వదేశీ పరిజ్ఞానంతో కొన్ని ప్రైవేటు సంస్థలు రూపొందించిన క్షిపణులను కూడా సమీప భవిష్యత్‌లో రఫేల్‌ జెట్స్‌లో అనుసంధానించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు రక్షణశాఖ వర్గాలు తెలిపాయి. 150 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యంపై దాడి చేసే సామర్ధ్యం కలిగిన మెటర్స్‌ క్షిపణులు రఫేల్‌ జెట్స్‌లో ఉన్నాయి. అయితే ఈ ఒక్కో మిస్సైల్ ధర రూ.25 కోట్లు. కానీ మన దేశంలో తయారయ్యే ఆస్ట్రా ఎయిర్‌, ఆస్ట్రా మార్క్‌ మిస్సైళ్ళ రేటు ఒక్కో దానికి రూ.10 కోట్లలోపే. అందుకే కొత్తగా తీసుకోబోయే రఫేల్‌ జెట్స్‌లో స్వదేశీ మిస్సైల్స్‌ను అమరేలా సెట్టింగ్స్ చేయాలని డసాల్ట్‌ ఏవియేషన్‌‌ను కోరుతోంది.

Advertisement

Next Story

Most Viewed