పింగళి వెంకయ్య పేరు పెట్టడం హర్షణీయం : పవన్ కళ్యాణ్

by M.Rajitha |
పింగళి వెంకయ్య పేరు పెట్టడం హర్షణీయం : పవన్ కళ్యాణ్
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ ప్రభుత్వం మచిలీపట్నం ప్రభుత్వ మెడికల్ కాలేజీకి పింగళి వెంకయ్య మెడికల్ కాలేజీగా పేరు మార్చిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. స్వాతంత్ర్య సమరయోధుడు, జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య పేరు ప్రభుత్వ మెడికల్ కాలేజీకి పెట్టడం హర్షణీయం అన్నారు. ఈ నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. స్వాతంత్ర్య పోరాటం జరుగుతున్న రోజుల్లో ప్రజల్లో స్పూర్తి నింపేలా పింగళి వెంకయ్య జాతీయ జెండాను రూపొందించారని ఈ సందర్భంగా కొనియాడారు. పింగళి గొప్పదనం ఈతరం విద్యార్థులకు తెలియజేయాల్సిన బాధ్యత మనదేనని అన్నారు. గత ప్రభుత్వం పలు విద్యాసంస్థలకు తమ ఇంట్లో వారి పేరు పెట్టుకుంటే.. తాము మాత్రం దేశ నాయకుల పేర్లు పెడుతున్నామని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed