- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చిన్నతనంలో ట్యూషన్ టీచర్ వేధించాడు : సాక్షి మాలిక్
దిశ, స్పోర్ట్స్ : రియో ఒలింపిక్ బ్రాంజ్ మెడలిస్ట్, భారత మాజీ రెజ్లర్ సాక్షి మాలిక్ ‘విట్‌నెస్’ పేరుతో రిలీజ్ చేసిన తన ఆత్మకథ పుస్తకంలో సంచలన విషయాలు తెలిపింది. చిన్నతనంలో తనను ట్యూషన్ టీచర్ వేధించాడని పేర్కొంది. ‘నాదే తప్పుందేమోనని అప్పుడు నేను నా కుటుంబానికి దీని గురించి చెప్పలేదు. నా స్కూల్ డేస్‌లో ట్యూషన్ టీచర్ నన్ను వేధించేవాడు. నన్ను తాకడానికి ప్రయత్నించేవాడు. అందుకే, ట్యూషన్ క్లాస్‌లకు వెళ్లేందుకు నేను భయపడేదాన్ని. కానీ, దీని గురించి మా అమ్మకు చెప్పలేదు.’ అని తెలిపింది. అలాగే, తోటి రెజ్లర్లు వినేశ్ ఫొగట్, భజరంగ్ పూనియాలపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఆసియా క్రీడల ట్రయల్స్ నుంచి మినహాయింపును అంగీకరించాలని వారు తీసుకున్న నిర్ణయం బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా చేస్తున్న నిరసనను దెబ్బతీసిందని తెలిపింది. ఆ నిర్ణయం వల్ల తాము స్వార్థపూరితంగా నిరసన చేస్తున్నామని చాలా మంది భావించేలా చేసిందని పుస్తకంలో రాసుకొచ్చింది.
- Tags
- #Sakshi Malik