- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఐదేళ్లలో అగ్రశ్రేణి ఆటో మార్కెట్‌గా భారత్: మారుతీ సుజుకి!
న్యూఢిల్లీ: రాబోయే ఐదేళ్లలో భారత్ ప్రపంచంలోనే అగ్రశ్రేణి ఆటోమొబైల్ తయారీ దేశంగా అవతరిస్తుందని దిగ్గజ వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి ఛైర్మన్ ఆర్‌సి భార్గవ అన్నారు. వివిధ ఒరిజినల్ పరికరాల తయారీదారులు(ఓఈఎం) రానున్న కొన్నేళ్లలో కొత్త పెట్టుబడులను ప్రకటించడం ద్వారా దేశీయ ఎగుమతులు గణనీయంగా పెరుగుతాయని ఆయన తెలిపారు. ఇటీవల హ్యూండాయ్ మోటార్ ఇండియా రూ. 20 వేల కోట్లు, ఎంజీ మోటార్ ఇండియా రూ. 5 వేల కోట్ల పెట్టుబడులను తయారీ సామర్థ్యంతో పాటు పోర్ట్‌ఫోలియో విస్తరణ కోసం ప్రకటించాయి. మారుతి సుజుకి సైతం దేశీయంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు వచ్చే ఏడేళ్లలో రూ. 18 వేల కోట్ల పెట్టుబడులను ప్రకటించింది.
అంతేకాకుండా విడి పరికరాల తయారీలో వినియోగదారుల డిమాండ్‌ను తీర్చేందుకు రూ. 300-350 కోట్ల పెట్టుబడులను కూడా ప్రకటించింది. ప్రస్తుతం భారత్ ప్రపంచ మార్కెట్లో మూడో స్థానంలో ఉంది. ఇప్పటికే జపాన్‌ను అధిగమించి యూఎస్, చైనాల తర్వాత స్థానంలో ఉన్నాం. ప్రస్తుతం దేశంలో కార్ల విక్రయాలు గణనీయంగా పెరుగుతున్నప్పటికీ, చైనాను అధిగమించడం అంత సులభమైన విషయం కాదని, గతేడాది చైనాలో మొత్తం 2.68 కోట్ల యూనిట్లను అమ్మగా, భారత్ 2.07 కోట్ల యూనిట్లను విక్రయించింది. సెమీకండక్టర్ల కొరత వల్ల ఉత్పత్తి సామర్థ్యం నెమ్మదించకపోతే కార్ల ఉత్పత్తి గణనీయంగా పెరిగే అవకాశం ఉందని భార్గవ పేర్కొన్నారు.