రాహుల్‌ను తప్పక అరెస్ట్ చేస్తాం.. అయితే లోక్‌సభ ఎన్నికల తర్వాతే : హిమంత

by Hajipasha |
రాహుల్‌ను తప్పక అరెస్ట్ చేస్తాం.. అయితే లోక్‌సభ ఎన్నికల తర్వాతే : హిమంత
X

దిశ, నేషనల్ బ్యూరో : ‘‘నాపై ఇష్టం వచ్చినన్ని కేసులను పెట్టుకోండి. కేసులతో నన్ను ఆపలేరు. బెదిరించలేరు’’ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ కౌంటర్ ఇచ్చారు. ‘‘మేం తప్పకుండా రాహుల్ గాంధీని అరెస్టు చేసి తీరుతాం. అయితే అది జరిగేది లోక్‌సభ ఎన్నికల తర్వాతేే. ఒకవేళ ఇప్పుడే మేం ఆ చర్య తీసుకుంటే.. దాన్ని రాజకీయ ప్రతీకార చర్యగా ప్రచారం చేసుకుంటారు’’ అని హిమంత పేర్కొన్నారు. అసోంలో భారత్ జోడో న్యాయ్ యాత్ర చేస్తున్న రాహుల్‌పై.. సీఎం హిమంత ఆదేశాల మేరకు పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. ‘‘అసోంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలనేదే రాహుల్ గాంధీ యాత్ర ఉద్దేశం’’ అని ఈ ఆదేశాలు ఇచ్చే క్రమంలో అసోం సీఎం ఆరోపణ చేశారు.

Advertisement

Next Story