ఢిల్లీలో కాషాయ పార్టీ జోరు.. బీజేపీ 5, ఇండియా కూటమి 2 స్థానాల్లో ముందంజ

by Shamantha N |
ఢిల్లీలో కాషాయ పార్టీ జోరు.. బీజేపీ 5, ఇండియా కూటమి 2 స్థానాల్లో ముందంజ
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీలోని ఏడు లోక్ సభ స్థానాలకు కౌంటింగ్ కొనసాగుతోంది. గత ఎన్నికల్లో ఏడుస్థానాల్లో గెలుపొంది క్లీన్ స్వీప్ చేసిన బీజేపీ ఈసారి అదే జోరు చూపిస్తుంది. 5 స్థానాల్లో కాషాయ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. బీజేపీ దివంగత నేత సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సూరి స్వరాజ్ ఈ ఎన్నికల్లో అరంగేట్రం చేశారు. న్యూఢిల్లీ స్థానం నుంచి ఆమె ఎన్నికల బరిలో నిలిచారు. కాగా.. ఆస్థానంలో ఆప్ అభ్యర్థి సోమనాథ్ భారతి ఆధిక్యంలో ఉన్నారు. గత ఎన్నికల్లో బెగుసరాయ్‌ నుంచి పోటీ చేసి ఓడిపోయిన కన్హయ్య కుమార్ ఈశాన్య ఢిల్లీ నుంచి బరిలో దిగారు. ఆ స్థానంలో బీజేపీ తరఫున పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎంపీ మనోజ్ తివారీ ముందంజలో ఉన్నారు. ఇక, ఢిల్లీలోని ఏడు స్థానాల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్, ఆప్ పొత్తు పెట్టుకున్నాయి.

Advertisement

Next Story