ఢిల్లీలో అమానుష ఘటన.. 8వ తరగతి బాలుడిపై లైంగిక దాడి చేసిన క్లాస్‌మెట్స్

by Harish |
ఢిల్లీలో అమానుష ఘటన.. 8వ తరగతి బాలుడిపై లైంగిక దాడి చేసిన క్లాస్‌మెట్స్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. 8వ తరగతి చదువుతున్న బాలుడిని అతని క్లాస్‌మెట్స్ కొట్టి, లైంగిక దాడికి పాల్పడటంతో సుమారు నెల రోజుల పాటు ప్రాణపాయ స్థితిలో ఆసుపత్రిలో ఉన్నాడు. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. బాధితుడి తల్లి పేర్కొన్న దాని ప్రకారం, 8వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల బాలుడిని మార్చి 18న అతని క్లాస్‌మెట్స్ తరగతి గది నుంచి బయటకు తీసుకెళ్లి బట్టలు తీసి కర్రలతో తీవ్రంగా కొట్టడంతో పాటు, అతనిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ముఖ్యంగా అతని పురీషనాళంలో కర్రను కూడా చొప్పించారు. దీంతో అతని ప్రేగులు తీవ్రంగా దెబ్బతిన్నాయిని బాధితుని తల్లి పేర్కొంది.

అయితే తనపై దాడి చేసిన విషయం బయటకు చెప్పవద్దని వారు బెదిరించడంతో ఆ బాలుడు పది రోజుల పాటు తన బాధను ఎవరికీ చెప్పకుండా, ఎవరికీ ఫిర్యాదు చేయకుండా మౌనంగా ఉన్నాడు. తరువాత అతనికి కడుపు నొప్పి రావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా జరిగిన ఈ దారుణం వెలుగులోకి వచ్చిందని బాధితుని తల్లి తెలిపింది. కొన్ని అంతర్గత అవయవాలు దెబ్బతిన్నాయని, బాలునికి మరో శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుందని వైద్యులు చెప్పారని ఆ మహిళ పేర్కొంది. దాదాపు నెల రోజులు ఆసుపత్రిలో ఉన్న ఆ బాలుడు ఇటీవల ఇంటికి వచ్చాడు. తన కుమారుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ, దీనిపై సీబీఐ విచారణ చేయాలని బాధితుని తల్లి కోరింది.

Advertisement

Next Story

Most Viewed