- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వన్యప్రాణులతో సెల్ఫీలు దిగితే జైలుకే: ఒడిశా ప్రభుత్వం వార్నింగ్
దిశ, నేషనల్ బ్యూరో: ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వన్యప్రాణులతో పొటోలు, లేదా సెఫ్ఫీలు తీసుకుని వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తే జైలు శిక్ష తప్పదని హెచ్చరించింది. వన్యప్రాణుల రక్షణ చట్టాన్ని ఉల్లంఘించొద్దని, ఏనుగులు, పులులు, ఇతర జంతువులతో సెల్ఫీలు దిగొద్దని తెలిపింది. ఈ మేరకు అధికారులకు ఓ లేఖ రాసింది. ‘వన్యప్రాణుల చట్టం ప్రకారం వాటితో ఫోటోలు, సెల్ఫీలు తీసుకోవడం, అలాంటి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వన్యప్రాణి (రక్షణ) చట్టం, 1972లోని సెక్షన్ 9 , 2 (16) నిబంధనలనుఉల్లంఘిస్తుంది’ అని లేఖలో పేర్కొంది. అంతేకాకుండా చనిపోయిన వన్యప్రాణులు. వన్యప్రాణుల శరీర భాగాలతో చిత్రాలు మరియు సెల్ఫీలు కూడా సోషల్‌లో పోస్ట్ చేయబడుతున్నాయి. ఇది చట్టంలోని 39 (I) (a), 39 (2) మరియు (3) సెక్షన్‌ల ఉల్లంఘనకు కూడా సమానం. చట్టం ప్రకారం, అటువంటి ఉల్లంఘనకు పాల్పడితే ఏడేళ్ల జైలు శిక్ష విధించబడుతుంది’ అని తెలిపింది. ఇటువంటి కార్యకలాపాలకు దూరంగా ఉండేలా ప్రజల్లో అవగాహన పెంపొందించాలని అటవీ అధికారులను ఆదేశించింది. చట్టం ఉల్లంఘనల గురించి సమాచారాన్ని పంచుకోవడానికి ప్రముఖ ప్రదేశాల్లో, సోషల్ మీడియాలో హెల్ప్‌లైన్ నంబర్‌లను ప్రదర్శిస్తామని తెలిపింది. ప్రతి ఒక్కరూ చట్టాలకు కట్టుబడి ఉండాలని, ఒక వేళ ఫొటోలు, సెల్ఫీలు తీసుకోవాలనుకుంటే అధికారుల అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది.