రైతులకు భారీ శుభవార్త.. ఆ పథకం కింద రూ.8 వేలు పెంచుతూ ముఖ్యమంత్రి కీలక ప్రకటన

by Anjali |
రైతులకు భారీ శుభవార్త.. ఆ పథకం కింద రూ.8 వేలు పెంచుతూ ముఖ్యమంత్రి కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: రైతులకు భారీ శుభవార్త. కిసాన్ సమ్మాన్ నిధి కింద ఇచ్చే మొత్తాన్ని 2 వేల రూపాయలు పెంచామని రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ కీలక ప్రకటన చేశారు. దీంతో సంవత్సరానికి రైతుల అకౌంట్లలో రూ. 8 వేలు జమ కానున్నాయి. 32 వేలు జమ అయ్యాయి. త్వరలో 17వ విడత డబ్బులు అన్నదాతల ఖాతాల్లో జమ కానున్నాయి. అయితే ఈ పథకంలో రైతులు లబ్ధి పొందాలంటే తప్పనిసరిగా ఈ- కేవైసీ చేసుకోవాలని వెల్లడించారు. ఇక నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాన మంత్రిగా ప్రమాణస్వీకారం చేయడానికి ఒక్క రోజు ముందు రాజస్థాన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం రాష్ట్ర పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. దేశ ప్రధానిగా మోడీ మూడోసారి రేపు (జూన్ 9) ప్రమాణ స్వీకారానికి సన్నాహాలు మొదలయ్యాయి. ఢిల్లీలో జరగనున్న ఈ ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమానికి భద్రతా ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నారు. నరేంద్ర మోదీ దేశానికి మూడోసారి ఆదివారం ప్రధానమంత్రి కాబోతున్నారు. కాగా రాజస్థాన్ లో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి అక్కడ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Advertisement

Next Story

Most Viewed