- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Manipur : వివాహితపై అత్యాచారం, సజీవ దహనం..మణిపూర్‌లో అమానుషం
దిశ, నేషనల్ బ్యూరో : మణిపూర్(Manipur)లో మెయితీ, కుకీ తెగల మధ్య ఘర్షణ మరోసారి తీవ్రరూపు దాల్చింది. జిరిబామ్ జిల్లా కేంద్రానికి ఏడు కిలోమీటర్ల దూరంలోని జైరాన్ గ్రామంలో సాయుధ దుండగులు అమానుషానికి తెగబడ్డారు. కుకీ(Kuki) తెగలోని హమార్(Hmar) వర్గానికి చెందిన 31 ఏళ్ల వివాహితను బంధించి పాశవికంగా హత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారానికి పాల్పడిన అనంతరం.. ఆమె ఇంటికి నిప్పంటించారు. దీంతో సదరు మహిళ ఆ ఇంట్లోనే సజీవ దహనమై, దారుణ స్థితిలో ప్రాణాలు వదిలింది. సాయుధ దుండగులు బాధిత మహిళ కాళ్లపైకి తుపాకులతో కాల్పులు జరిపారని ఇండిజెనస్ ట్రైబ్స్ అడ్వకసీ కమిటీ ఆరోపించింది. దీనిపై మృతురాలి భర్త గుర్థాన్ సాంగ్ జిరిబామ్ జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
‘‘గురువారం రాత్రి మా ఊరి(జైరాన్)లోకి మెయితీ(Meiteis) వర్గానికి చెందిన మిలిటెంట్లు పెద్ద సంఖ్యలో చొరబడ్డారు. మా ఊరివాళ్లపైకి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీంతో ఊరి వాళ్లంతా భయపడి సమీపంలోని అడవుల్లోకి పారిపోయారు. నేను.. నా తల్లిదండ్రులు, ముగ్గురు పిల్లలతో కలిసి అడవిలోకి వెళ్లిపోయాను. నా భార్య మాత్రం మిలిటెంట్లకు దొరికింది. వాళ్లు నా భార్యపై హత్యాచారం చేశారు. దాదాపు గురువారం రాత్రి 9 గంటలకు ఆ దుండగులు నా భార్యను సజీవ దహనం చేశారు’’ అని ఫిర్యాదులో గుర్థాన్ సాంగ్ పేర్కొన్నాడు. ఈ ఘటనతో తన ముగ్గురు పిల్లలు తల్లిని కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశాడు. మెయితీ వర్గానికి చెందిన ‘అరంబై తెన్‌గోల్’ అనే సంస్థ మిలిటెంట్లే ఈ దాడి చేశారని గుర్థాన్ సాంగ్ ఆరోపించాడు. గ్రామంలోని చాలా ఇళ్లకు సాయుధ దుండగులు నిప్పుపెట్టారని తెలిపాడు. చనిపోయిన మహిళకు అసోంలోని సిల్చార్‌లో పోస్టుమార్టం నిర్వహించేందుకు అనుమతి కోరుతూ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్‌కు జిరిబామ్ జిల్లా ఎస్పీ లేఖ రాశారు. జిరిబామ్ జిల్లాలోనే పోస్టుమార్టం నిర్వహిస్తే ఉద్రిక్తత ఏర్పడే అవకాశం ఉంటుందని తెలిపారు. చాలా ఫోరెన్సిక్ వైద్య సౌకర్యాలు జిరిబామ్‌లో అందుబాటులో లేవని ఎస్పీ పేర్కొన్నారు.