Assam: లవ్ జీహాద్ అరికట్టేందుకు కొత్త చట్టాన్ని తేనున్న హిమంత సర్కారు

by Shamantha N |
Assam: లవ్ జీహాద్ అరికట్టేందుకు కొత్త చట్టాన్ని తేనున్న హిమంత సర్కారు
X

దిశ, నేషనల్ బ్యూరో: అసోంలో లవ్ జీహాదిని అరికట్టేందుకు కొత్త చట్టాలను రూపొందిస్తున్నట్లు ఆరాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ వెల్లడించారు. అసోంలో ల‌వ్ జిహాదీ కేసులు పెరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వాటిని అదుపు చేసేందుకు క‌ఠిన‌మైన చ‌ట్టాన్ని తెస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. సోషల్ మీడియాలో హిందువుల ఫోటోలు పెట్టి, అమ్మాయిల‌కు వ‌ల‌వేసి వెళ్లి చేసుకుంటున్నార‌ని పేర్కొన్నారు. కొన్నాళ్ల‌కు వాస్తవం బయటకు వస్తోందని అన్నారు. బాధితురాలికి న్యాయం జరగాలని గత ఐదేళ్లుగా నమోదైన కేసుల్ని తమ ప్రభుత్వం అధ్యయనం చేస్తోందన్నారు. దాని ఆధారంగా క‌ఠిన చ‌ట్టాన్ని త‌యారు చేయ‌నున్న‌ట్లు హిమంత తెలిపారు. అమ్మాయిల‌ను ట్రాప్ చేసేందుకు చేసేందుకు త‌మ ఐడెంటిటీని దాచిపెడుతున్న వారికి క‌ఠిన శిక్ష అమ‌ల‌య్యేలా చ‌ట్టాన్ని తెస్తామన్నారు.

ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక భూచట్టం

అసోంలోని విభిన్న భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా ఎస్సీ, ఎస్టీ కమ్యూనిటీ ప్రజలు మైనారిటీలుగా మారిపోతున్నారని హిమంత అన్నారు. ఎస్సీ, ఎస్టీల భూముల విక్రయానికి ప్రత్యేక చట్టాన్ని తెస్తామన్నారు. వారి నుంచి భూములను అక్రమంగా కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. అయితే, ఎస్సీ, ఎస్టీ, బీసీలు తమ భూముల్ని కేవలం తమ సామాజిక వర్గానికి మాత్రమే అమ్ముకునేలా చట్టాన్ని రూపొందిస్తామన్నారు. ఇలాగైనా ఆ కమ్యూనిటీ ప్రజలను మైనారిటీలుగా మారకుండా చేయొచ్చన్నారు.

Advertisement

Next Story