- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కుక్కను వండుకొని తిన్న హైవే పెట్రోలింగ్ సిబ్బంది

- తప్పిపోయిందనుకొని వెతుకుతున్న యజమాని
- అసలు విషయం తెలిసి అనారోగ్యం పాలైన యజమాని
దిశ, నేషనల్ బ్యూరో: రోడ్డు పక్కన పడి ఉన్న ఒక కుక్క(Dog)ను హైవే పెట్రోలింగ్ (Highway Patrol)సిబ్బంది తమ కంపెనీ కిచెన్‌కు తీసుకొని వెళ్లి వండుకొని తినేశారు. ఇది మన దేశంలో జరిగిన ఘటన కాదు. చైనా(China)లోని షెంజెన్ సిటీ(Shenzhen City)లో జరిగింది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ (South China Morning Post)కథనం ప్రకారం.. ఒక మహిళ మాల్దీవుల(Maldives)కు వెకేషన్‌కు వెళ్తూ.. తన నాలుగేళ్ల పెంపుడు కుక్క 'యీ యీ'ని ఒక కేర్ టేకింగ్ సెంటర్(Care taking center)లో ఉంచి వెళ్లింది. అయితే అక్కడ నుంచి తప్పించుకున్న ఆ కుక్క.. షెంజెన్ హైవేపై పరిగెత్తుతూ ఒక కారు ఢీకొని చనిపోయింది. అయితే హైవే పెట్రోలింగ్ సిబ్బంది రోడ్డు పక్కన ఉన్న కుక్కను తీసుకొని తమ కంపెనీకి వెళ్లిపోయారు. అక్కడే కుక్కను వండుకొని ఎనిమిది మంది సిబ్బంది తినేశారు. అయితే ఈ విషయం తెలియని యజమాని.. తన కుక్క తప్పిపోయిందేమో అనుకొని.. ఆచూకీ కనిపెట్టిన వారికి 6,800 డాలర్లు (సుమారు రూ.5 లక్షలు) రివార్డుగా ఇస్తానని ప్రకటించింది. 'యీ యీ'తన కుటుంబ సభ్యురాలితో సమానమని.. దయచేసి వెతికిపెట్టమని కోరతూ ప్రకటన ఇచ్చింది.
అయితే కుక్కను తీసుకొని హైవే పట్రోలింగ్ సిబ్బంది వెళ్లడం చూసిన వారు.. ఈ విషయాన్ని యజమానికి చెప్పారు. సీసీ టీవీ ఫుటేజీ(CCTV footage)లో కూడా పెట్రోలింగ్ సిబ్బంది తమ కారులో కుక్కను తీసుకొని వెళ్లడం కనిపించింది. అయితే సదరు పెట్రోలింగ్ అధికారులను విచారించగా.. తాము రోడ్డు పక్కన పడిఉన్న కుక్కను తీసుకొని వచ్చింది నిజమే. అయితే దాన్ని వండుకొని తినేశామని చెప్పారు. అది వీధి కుక్కగా భావించామని, అప్పటికే దాని ప్రాణం పోయిందని పెట్రోలింగ్ అధికారులు పేర్కొన్నారు. విషయం తెలుసుకొని యజమానురాలు కన్నీరు మున్నీరుగా విలపించింది. అంతే కాకుండా 'యీ యీ' విషయంలో జరిగిన దారుణాన్ని తలచుకొని అనారోగ్యం పాలయ్యింది.
కాగా, ఈ ఘటనపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే కుక్కను తీసుకెళ్లిన ఇద్దరు సిబ్బంది మాత్రం.. మేము అన్ని రకాల నిబంధనలు పాటించామని చెబుతున్నారు. కుక్క రోడ్డు పక్కన పడి ఉన్న దాన్ని ఫొటో తీసుకొని.. వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశామని తెలిపారు. అయితే ఆ కుక్క చనిపోయి ఉండటంతోనే.. వండుకొని తినేశారని హైవే కంపెనీ అధికార ప్రతినిధి చెప్పారు. కాగా, చైనాలో కుక్కలు, పిల్లులను వండుకొని తినే విషయంలో బ్యాన్ విధించిన మొట్టమొదటి సిటీ షెంజన్ కావడం గమనార్హం.