వినేష్ ఫొగట్ అనర్హతపై హేమమాలిని వివాదాస్పద కామెంట్స్

by M.Rajitha |
వినేష్ ఫొగట్ అనర్హతపై హేమమాలిని వివాదాస్పద కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్ : పారిస్ ఒలింపిక్స్‌లో వినేష్ ఫొగట్ మీద అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. ఈ వార్త యావత్ భారత అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ క్రమంలో పలువురు రాజకీయ నాయకులు, సెలబ్రెటీలు ఈ విషయంలో వినేష్ కు బాసటగా నిలుస్తుండగా.. బీజేపీ ఎంపీ, బాలీవుడ్ సీనియర్ నటి హేమామాలిని మాత్రం వివాదాస్పద కామెంట్స్ చేశారు. "కేవలం 100 గ్రాముల కారణంగా అనర్హతకు గురికావడం తనని ఆశ్చర్యానికి గురిచేస్తోందని, బరువు విషయంలో ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉన్నారో అర్థం కావడం లేదన్నారు. ఇప్పటికైనా బరువు తగ్గించుకోవడం ఎంత ముఖ్యమో ప్రతి ఒక్కరూ గుర్తించాలి. ఆమె త్వరగా ఆ 100 గ్రాములు కోల్పోతుందని ఆశిస్తున్నాను కాని ఒలంపిక్ పతకాన్ని అయితే మనం పొందలేము కదా" అంటూ హేమ సంచలన కామెంట్స్ చేశారు. ఒలంపిక్ క్రీడాకారినిపై కామెంట్స్ చేసిన హేమపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 'ఒక ఎంపీ.. అందులోనూ మహిళ అయి ఉండి కష్టకాలంలో ధైర్యం నింపాల్సింది పోయి ఇలా మాట్లాడటం, సిగ్గుచేటని.. వెంటనే ఈ రాబందులను దేశం నుండి తరిమి వేయండి' అని కామెంట్స్ చేస్తున్నారు.

Next Story

Most Viewed