- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఎన్నికల ప్రచారంలో సరికొత్త అవతారంలో 'డ్రీమ్ గర్ల్'.. వైరల్ అవుతున్న ఫొటోలు
దిశ, నేషనల్ బ్యూరో: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా అన్ని పార్టీల అభ్యర్థులు తమ ప్రచారాన్ని వేగవంతం చేశారు. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో సినీ తారలు కూడా పోటీ చేస్తుండగా, వారు ప్రచారంలో కొత్త కొత్త అవతారాల్లో కనిపిస్తూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. తమ అప్‌డేట్‌లను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా 'డ్రీమ్ గర్ల్' హేమమాలిని ఉత్తరప్రదేశ్ మథుర స్థానం నుంచి బీజేపీ తరపున ప్రధాన అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అయితే లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన సమయంలో ఆమె, పొలంలోకి వెళ్లి రైతులతో కలిసి గోధుమ పంటను కోశారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆమె ఎక్స్‌లో షేర్ చేశారు.
''నేను 10 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా రైతులను కలుస్తున్నాను, ఈ రోజు కూడా వారితో కలిసి సంభాషించడానికి నేను పొలాల్లోకి వెళ్లాను, రైతుల మధ్య ఉండటం నాకు ఇష్టం, రైతులు కూడా నేను వారి వద్దకు రావడాన్ని ఇష్టపడతారని" ఎక్స్‌లో అన్నారు. ఇంతకుముందు 2014, 2019 ఎన్నికల్లో కూడా హేమ మాలిని మథుర నుంచి గెలుపొందారు. ఈ స్థానం బీజేపీకి కంచుకోటగా ఉంది. ముఖ్యంగా, 2014 ఎన్నికల సమయంలో మథుర స్థానంలో హేమ మాలిని 3 లక్షల ఓట్ల తేడాతో తన ప్రత్యర్థి జయంత్‌పై విజయం సాధించారు. ఈ సారి కూడా గెలిచి హ్యట్రిక్ విజయం సాధిస్తానని హేమ మాలిని ధీమా వ్యక్తం చేస్తున్నారు.