- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పోలీస్ కాన్వాయ్‌పై ఎటాక్.. ఇద్దరు గార్డ్స్‌ను చంపేసి డ్రగ్ డాన్‌తో ‘ఫ్లై’
దిశ, నేషనల్ బ్యూరో: ఫ్రాన్స్ లో డ్రగ్ డీలర్ “ది ఫ్లై” గ్యాంగ్ హల్ చల్ చేసింది. ఇద్దరు గార్డులను చంపి గ్యాంగ్ లీడర్ ది ఫ్లైని విడిపించుకుని పరారయ్యారు. దీంతో ఫ్రాన్ అంతటా రెడ్ అలెర్ట్ జారీ చేశారు. డ్రగ్ ముఠా కోసం అధికారులు వెతుకున్నారు. ఫ్రాన్స్ లో కొకైన్ దందా విపరీతంగా సాగుతుంది. మహ్మద్ అమ్రా ఓ డ్రగ్ ముఠాకు లీడర్. ఆయనను ది ఫ్లై పేరుతో పిలుస్తారు. అయితే ఓ దోపిడీ కేసులో అతడికి మే 10న 18 నెలల శిక్ష విధించింది కోర్టు. మరో కేసు విచారణలో రోయూన్ సిటీ నుంచి నార్మండీకి అమ్రాను తరలిస్తుండగా.. అతడి గ్యాంగ్ మెంబర్స్ పోలీస్ కాన్వాయ్ పై మెరుపు దాడి చేశారు.
ఇంక్రావిల్లే దగ్గర టోల్‌బూత్ దాటుతుండగా బ్లాక్ కార్ లో వచ్చిన దుండగులు రెచ్చిపోయారు. పోలీస్ కాన్వాయ్ ని ఢీకొని విచక్షణారహితంగా కాల్పులు చేశారు. అత్యాధునిక పరికరాలతో పోలీసులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా.. ముగ్గురికి గాయాలయ్యాయి. అమ్రాను తీసుకొని రెండు కార్లలో పరారయ్యారు.
రెండ్రోజుల క్రితం జైలు ఊచలు కట్ చేసి పరారయ్యేందుకు అమ్రా ప్రయత్నించాడని అతని తరఫు న్యాయవాది తెలిపారు. కాల్పుల ఘటనతో అమ్రాకు సంబంధం ఉండకపోవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. మరోవైపు, అమ్రాకు ఫ్రాన్స్‌లోనే అత్యంత శక్తిమంతమైన బ్లాక్స్ గ్యాంగ్‌తో సంబంధాలున్నాయి.
ఈ ఘటనపై ప్రాన్స్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితులను కఠినంగా శిక్షిస్తామని పేర్కొంది. ఇకపోతే, ఫ్రాన్స్ లో మాదకద్రవ్యాల వాడకంపై ప్రభుత్వం ఓ నివేదిక విడుదల చేసింది. డ్రగ్స్, దాని వల్ల హింస భవిష్యత్ లో గణనీయంగా పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేసింది. గత దశాబ్దంలో ఫ్రెంచ్ లో కొకైన్ దందా ఐదు రెట్లు పెరిగిందని తెలిపింది. ఫ్రాన్స్ లో మాదకద్రవ్యాల వ్యాపారం వార్షిక టర్నోవర్ 3.5 బిలియన్ యూరోలు అని వెల్లడించింది. ఇకపోతే, ఈ నివేదిక వచ్చిన రోజే.. ఈ ఘటన జరగడం గమనార్హం.