- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
గుజరాత్, రాజస్థాన్ లో బీజేపీ హవా
దిశ, నేషనల్ బ్యూరో: గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో బీజేపీ అభ్యర్థులు దూసుకుపోతున్నారు. గుజరాత్ లోని 25 లోక్ సభ స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. కేవలం ఒక స్థానంలోనే కాంగ్రెస్ ముందంజలో ఉంది. రాజ్ కోట్ నుంచి బరిలో దిగిన కేంద్రమంత్రి పురుషోత్తం రుపాలా 81,126 ఓట్ల ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. ఇవే కాకుండా గుజరాత్ లోని 3 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నిక జరిగింది. 2022 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున గెలిచిన అభ్యర్థులు ఆ తర్వాత బీజేపీలో చేరారు. దీంతో ఉపఎన్నిక జరిగింది. పోర్ బందర్, విజాపూర్, ఖంభాట్ అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.
రాజస్థాన్ లో బీజేపీకి భారీ ఆధిక్యం
రాజస్థాన్ లోని 14 స్థానాల్లో కాషాయ పార్టీ గెలుపు దిశగా దూసుకెళ్తుంది. రాజస్థాన్ లోని 10 స్థానాల్లో ఇండియా కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. రాజస్థాన్ లోని కోటా నుంచి లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా ముందజలో ఉన్నారు. రాజస్థాన్ లోని రెండుస్థానాల్లో బీజేపీ మహిళా అభ్యర్థులు భారీ మెజార్టీతో దూసుకుపోతున్నారు. జైపూర్ లో బీజేపీ అభ్యర్థి మంజూ శర్మ 1.2 లక్షల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. రాజసమంద్ లో బీజేపీ అభ్యర్థి మహిమా కుమారి 96 వేల ఓట్లతో ముందంజలో ఉన్నారు.