ప్రభుత్వ పాలసీతో మహిళలకు మరిన్ని అవకాశాలు : ప్రధాని మోడీ

by Vinod kumar |
ప్రభుత్వ పాలసీతో మహిళలకు మరిన్ని అవకాశాలు : ప్రధాని మోడీ
X

న్యూఢిల్లీ: కొత్త పార్లమెంటు భవనంలో మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఆమోదం.. దేశ కొత్త భవిష్యత్తుకు నాంది పలికిందని ప్రధాని మోడీ అన్నారు. దీని ద్వారా మహిళలకు నూతన ద్వారాలు తెరవడమే తమ ప్రభుత్వ విధానమని ఆయన స్పష్టం చేశారు. ‘రోజ్‌గార్ మేళా’(ఉపాధి మేళా) కింద వివిధ ప్రభుత్వ శాఖల్లో కొత్తగా నియమితులైన 51000 మంది అభ్యర్థులకు మంగళవారం జరిగిన వర్చువల్‌ ఈవెంట్‌లో అపాయింట్‌మెంట్ లెటర్స్ పంపిణీ చేశారు. దేశవ్యాప్తంగా 46 ప్రదేశాల్లో ఈ మేళా నిర్వహించగా.. ఒక్క అండమాన్, నికోబార్ దీవుల్లోనే 1,000 మందికి నియామక పత్రాలు (గ్రూప్ B, C కేటగిరీలు) అందించారు.

ఈ మేరకు వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. ‘రోజ్‌గార్ మేళా కింద ఈ రోజు అపాయింట్‌మెంట్ లెటర్స్ అందుకున్న వారందరినీ అభినందిస్తున్నాను. ప్రభుత్వ పథకాల్లో సాంకేతికత వినియోగం అనేది అవినీతి, సంక్లిష్టతలను అరికట్టింది. విశ్వసనీయతతో పాటు సౌలభ్యాన్ని పెంచింది’ అని కొత్త నియామకాలను ఉద్దేశించి మాట్లాడారు. ‘సిటిజన్స్ ఫస్ట్’ అనే నినాదంతో పనిచేయాలని, పాలనను మెరుగుపరచడానికి టెక్నాలజీ ఉపయోగించాలని వారికి సూచించారు.

Advertisement

Next Story