Menstrual Leave : మహిళా ఉద్యోగులకు గుడ్ న్యూస్.. స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఆ సర్కార్ కీలక నిర్ణయం

by Ramesh N |
Menstrual Leave : మహిళా ఉద్యోగులకు గుడ్ న్యూస్.. స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఆ సర్కార్ కీలక నిర్ణయం
X

దిశ, డైనమిక్ బ్యూరో: 78వ స్వాతంత్య్ర దినోత్సవం వేళ ఒడిశా సర్కార్ మహిళలకు తీపి కబురు అందించింది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పనిచేసే మహిళా ఉద్యోగుల కోసం ఒక రోజు నెలసరి సెలవు పాలసీని ప్రవేశపెడుతున్నట్లు గా ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే కటక్‌లో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర డిప్యూటీ సీఎం ప్రవతి పరీదా ఈ ప్రకటన చేశారు. తక్షణమే ఈ పాలసీ అమలులోకి వస్తుందని పేర్కొన్నారు. మహిళల ఆరోగ్యం, శ్రేయస్సే లక్ష్యంగా నెలసరి సెలవుల్ని తెస్తున్నట్లు ప్రవితి పరిదా స్పష్టంచేశారు. మహిళ ఉద్యోగులు నెలసరి సమయంలో మొదటి లేదా రెండో రోజు సెలవు తీసుకోవచ్చని వెల్లడించారు.

ఒడిశా ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ఇప్పటివరకు బీహార్, కేరళలో మాత్రమే మహిళలకు రుతుస్రావం సెలవు విధానాలను కలిగి ఉన్నాయి. దేశంలో జొమాటో వంటి సంస్థల్లో సైతం ఈ సెలవులు ఉన్నాయి. కాగా, ఇటీవల ఉద్యోగినులకు నెలసరి సెలవు ఇవ్వాలనే డిమాండ్ ఎక్కువైంది. ఇటీవల సుప్రీంకోర్టు ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేసింది. రుతుస్రావ సెలవుపై మోడల్ విధానాన్ని రూపొందంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు కోరింది. ఈ సెలవులపై న్యాయపరమైన జోక్యం కంటే విధాన రూపకల్పన పరిధిలోకి వస్తుందని హైలైట్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలతో, ఉపాధి సంస్థలతో చర్చించి కేంద్రం తీసుకోవాల్సిన పాలసీ నిర్ణయం అని పేర్కొంది.

Advertisement

Next Story