Gay couple: దత్తపుత్రులపై లైంగిక దాడి.. గే జంటకు 100 ఏళ్ల జైలు శిక్ష

by vinod kumar |
Gay couple: దత్తపుత్రులపై లైంగిక దాడి.. గే జంటకు 100 ఏళ్ల జైలు శిక్ష
X

దిశ, నేషనల్ బ్యూరో: తమ దత్త పుత్రులపై (Adopted sons) లైంగిక దాడికి పాల్పడిన గే జంటకు అమెరికా కోర్టు (America court)100 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2022లో నమోదైన ఈ కేసులో న్యాయస్థానం ఇద్దరు వ్యక్తులను దోషులుగా నిర్ధారించింది. వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని జార్జియా రాష్ట్రానికి చెందిన జాకరీ జులోక్(Jakery julok), విలియం డేల్ జులోక్‌ (villiam dale juloke) అనే వ్యక్తులు ఇద్దరూ గే వివాహం చేసుకుని అట్లాంటాలో నివసిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం వీరు ఓ అనాథాశ్రమం నుంచి 10, 12 ఏళ్ల వయసు గల పిల్లలను దత్తత తీసుకున్నారు. అయితే దత్తత తీసుకున్న ఆ పిల్లలను వీరు లైంగికంగా వేధించడంతో పాటు తీవ్రంగా చిత్ర హింసలకు గురి చేశారు. అంతేగాక పిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న సమయంలో వీడియోలు తీసి వాటిని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు.

ఈ క్రమంలోనే 2022లో ఓ వ్యక్తి దీనిపై ఫిర్యాదు చేయగా గూగుల్ (Google) ఖాతాకు అప్ లోడ్ చేయబడిన ఆకృత్యాలను పోలీసులు గమనించి విచారణ చేపట్టారు. దీంతో పలు సాక్ష్యాలను గుర్తించి జులోక్, విలియంలను అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి వీరు జైలులోనే ఉండగా విచారణ జరుగుతోంది. తాజాగా దీనిపై మరోసారి విచారణ చేపట్టిన కోర్టు గే జంటను దోషులుగా తేల్చింది. పిల్లల వేధింపుల నేరాలను సైతం వారు అంగీకరించారు. దీంతో న్యాయస్థానం వంద సంవత్సరాల జైలు శిక్ష ఖరారు చేసింది. వీరిద్దరికి చెందిన ఆస్తులు పిల్లలకే చెందుతాయని స్పష్టం చేసింది.

Advertisement

Next Story

Most Viewed