- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ అడవుల్లో మావోయిస్టుల ఆయుధ ఫ్యాక్టరీలు.. పేల్చేసిన భద్రతా బలగాలు
దిశ, నేషనల్ బ్యూరో : పోలీసులకు కొరకరాని కొయ్యగా మిగిలిన ఛత్తీస్‌గఢ్‌లోని అబూజ్‌మడ్ అడవులను భద్రతా బలగాలు అణువణువునా జల్లెడ పడుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన బీజేపీ సర్కారు అక్కడి నుంచి నక్సల్స్‌ను ఏరిపారవేసే లక్ష్యంతో జనవరి 13న మొదలుపెట్టిన ఆపరేషన్ సూర్య శక్తిలో కీలక పురోగతి నమోదైంది. అబూజ్‌మడ్‌లోని దట్టమైన అడవులు కేంద్రంగా మావోయిస్టులు నడుపుతున్న బారెల్ గ్రెనేడ్ లాంచర్(బీజీఎల్), ఇతర ఆయుధాలు, బాంబుల తయారీ కేంద్రాలను గుర్తించి భద్రతా బలగాలు ధ్వంసం చేశాయి. పలుచోట్ల మావోయిస్టుల ఆయుధ డంప్‌లను స్వాధీనం చేసుకున్నారు. బారెల్ గ్రెనేడ్ లాంచర్ల తయారీకి మావోయిస్టులు లాత్ మిషన్లు, ఇనుప పైపులు, డ్రిల్లింగ్, పంచింగ్ మిషన్లను వాడుతున్నట్లు గుర్తించారు. ఈ వివరాలను బస్తర్ రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పి. సుందర్‌రాజ్ వెల్లడించారు. అబూజ్‌మడ్ అడవుల్లో బైపాడ్ గ్రెనేడ్ లాంచర్, నాలుగు బీజీఎల్ షెల్స్, రెండు ఎయిర్ రైఫిల్స్, రెండు మజిల్ లోడింగ్ ఆయుధాలు, ఒక 12 బోర్ గన్, మూడు ఇన్సాస్ మేగజైన్లు, ఒక టెలిస్కోప్, రెండు జనరేటర్లు, డ్రిల్లింగ్ మిషన్లు, పంచింగ్ మిషన్లు, మావోయిస్టు యూనిఫాంలు, విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ ఆపరేషన్ క్రమంలో రెండు చోట్ల భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎన్‌కౌంటర్ జరగగా.. నలుగురిని అరెస్టు చేశారు. ఆపరేషన్ సూర్య శక్తిలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF), డిస్ట్రిక్ట్ రిజర్వ్ గ్రూప్ (DRG), బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) సిబ్బంది పాల్గొన్నారు.