- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Sambhal : సంభల్ ఎంపీపై మరో కేసు.. ఈసారి విద్యుత్ చౌర్యం అభియోగాలు
దిశ, నేషనల్ బ్యూరో : షాహీ జామా మసీదు సర్వేను వ్యతిరేకిస్తూ ఓ వర్గం వారు నిరసనలకు దిగినప్పటి నుంచి ఉత్తరప్రదేశ్‌లోని సంభల్(Sambhal) తరుచుగా వార్తల్లో నిలుస్తోంది. ఆ నిరసనల్లో కీలక పాత్ర పోషించారనే అభియోగాలను ఎదుర్కొన్న సంభల్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జియావుర్ రహ్మాన్ బర్ఖ్(Ziaur Rehman Barq)పై మరో పోలీసు కేసు నమోదైంది. అయితే ఆ కేసు సంభల్ అల్లర్లకు సంబంధించినది కాదు. సంభల్ పట్టణంలోని దీపా సరాయ్ ఏరియాలో ఉన్న ఆయన ఇంటి కోసం చోరీ చేసిన విద్యుత్(power theft)ను వాడుకుంటున్నారనే అభియోగాలతో గురువారం ఉదయం కేసును నమోదు చేశారు. విద్యుత్ శాఖ అధికారుల అనుమతి లేకుండా, దొంగతనంగా విద్యుత్‌ను ఎంపీ ఇంట్లో వినియోగిస్తున్నారని ఎఫ్‌ఐఆర్‌లో ప్రస్తావించారు.
విద్యుత్ చట్టం-2003లోని సెక్షన్ 135 కింద సంభల్ ఎంపీపై కేసును నమోదు చేశామని విద్యుత్ విభాగం అధికార వర్గాలు వెల్లడించాయి. ఎంపీ జియావుర్ రహ్మాన్ ఇంట్లోని విద్యుత్ మీటరును శాస్త్రీయంగా తనిఖీ చేయగా ఈవిషయం నిర్ధారణ అయిందన్నారు. విద్యుత్ మీటరుతో సంబంధం లేకుండా ఎంపీ ఇంటికి విద్యుత్ సరఫరా జరిగిందని విచారణలో తేలిందన్నారు. గతంలో సంభల్ అల్లర్లకు సంబంధించిన ఒక కేసు కూడా ఎంపీ జియావుర్ రహ్మాన్ బర్ఖ్‌పై నమోదైంది. అయితే ఆ అల్లర్లు జరిగిన టైంలో తాను సంభల్‌లో లేనని, బెంగళూరులో జరిగిన వక్ఫ్ సదస్సుకు వెళ్లానని ఆయన అప్పట్లో వెల్లడించారు.