- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నా పిల్లల మర్డర్‌కు కారణమేంటి ? తండ్రి సూసైడ్ యత్నం
దిశ, నేషనల్ బ్యూరో : ఉత్తరప్రదేశ్‌లోని బుదౌన్‌లో మార్చి 19న జరిగిన ఇద్దరు పిల్లల మర్డర్ వ్యవహారం కలకలం రేపుతోంది. తన ఇద్దరు పిల్లల హత్య జరగడానికి అసలు కారణాలేంటో పోలీసులు ఇంకా చెప్పడం లేదనే మనస్తాపంతో తండ్రి వినోద్ సింగ్ ఆదివారం ఆత్మహత్యకు యత్నించాడు. తన బైక్‌కు నిప్పంటించిన వినోద్.. అక్కడే తాను కూడా నిప్పంటించుకునేందుకు ప్రయత్నించాడు. ఇరుగుపొరుగు వారి నుంచి సమాచారం అందడంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు, స్థానికులతో కలిసి నిప్పంటించుకోకుండా వినోద్ సింగ్‌ను అడ్డుకున్నారు. తన పిల్లలు హత్యకు గురై ఆరు రోజులవుతున్నా.. ఇప్పటిదాకా కారణం చెప్పకపోవడం దారుణమని పోలీసులతో వినోద్, అతడి కుటుంబ సభ్యులు వాపోయారు. ‘‘ఇరుగు పొరుగు వారు వినోద్ పిల్లల మర్డర్‌పై రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. అందుకే అతడు సహనం కోల్పోయి సూసైడ్ చేసుకోబోయాడు’’ అని వినోద్ తల్లి మున్నీ దేవి చెప్పారు. ‘‘హోలీ పండుగ కోసం తన పిల్లలందరికీ వినోద్ కొత్త బట్టలు తెచ్చాడు. ఆలోగా మర్డర్ జరిగి ఇద్దరు పిల్లలు చనిపోవడంతో అతడు డిప్రెషన్‌లోకి వెళ్లాడు. పిల్లల కొత్త బట్టలను చూసుకొని వినోద్ తనను తాను కంట్రోల్ చేసుకోలేక సూసైడ్‌కు యత్నించాడు’’ అని బుదౌన్ ఎస్ఎస్పీ అలోక్ ప్రియదర్శి మీడియాకు వెల్లడించారు. కాగా, వినోద్ ఇంటి ఎదుటే సాజిద్ సెలూన్ షాపు నిర్వహించేవాడు. మార్చి 19న వినోద్ ఇంట్లోకి కత్తితో ప్రవేశించిన సాజిద్.. వినోద్ ముగ్గురు పిల్లలపై దాడి చేశాడు. ఈ దాడిలో ఇద్దరు పిల్లలు చనిపోయారు. మూడో బాబు తలకు తీవ్ర గాయం కావడంతో ఆస్పత్రిలో చేర్పించారు. ఆ వెంటనే ఉత్తరప్రదేశ్ పోలీసుల ఎన్‌కౌంటర్‌లో సాజిద్ చనిపోయాడు. ఈ కేసులో రెండో నిందితుడిగా ఉన్న సాజిద్ సోదరుడు జావేద్‌ను మార్చి 21న పోలీసులు అరెస్టు చేశారు. తనకు ఈ హత్యలో పాత్ర లేదని జావేద్ చెప్పాడు.