ఈవీఎంల ట్యాంపరింగ్‌పై ఫేక్ ఫోస్టు: కేరళకు చెందిన వ్యక్తి అరెస్టు

by samatah |
ఈవీఎంల ట్యాంపరింగ్‌పై ఫేక్ ఫోస్టు: కేరళకు చెందిన వ్యక్తి అరెస్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్(ఈవీఎం)లను ట్యాంపర్ చేసేందుకు దేశంలో మూడు వారాల పాటు లాక్‌డౌన్‌ ప్రకటించనున్నారని తప్పుడు ప్రచారం చేసిన వ్యక్తిని కేరళ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని రాష్ట్రంలోని మలప్పురం జిల్లాకు చెందిన ఎంవీ షరాఫుద్దీన్‌గా గుర్తించారు. ఫేక్ పోస్టులో భాగంగా కొవిడ్ సమయంలో ప్రచురించిన ఓ వార్తా కథనానికి సంబంధించిన స్క్రీన్ షాట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసి..దేశంలో లాక్ డౌన్ విధించనున్నారని పేర్కొన్నాడు. కొచ్చి సైబర్‌డోమ్ బ్రాంచ్ నిర్వహించిన సోషల్ మీడియా దర్యాప్తులో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలోనే పోలీసులు ఫరాఫుద్దీన్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాగా, లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు పోస్ట్‌లు చేస్తున్న వారిని గుర్తించేందుకు సైబర్ విభాగం ఆధ్వర్యంలో సైబర్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్, అన్ని పోలీసు జిల్లాల్లో సోషల్ మీడియా మానిటరింగ్ సెల్‌లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story