- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఫ్రాన్స్ పార్లమెంటు రద్దు.. అధ్యక్షుడు మేక్రాన్ అనూహ్య నిర్ణయం
దిశ, నేషనల్ బ్యూరో: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మేక్రాన్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంట్ ను రద్దు చేస్తూ స్నాప్ ఎలక్షన్ కు పిలుపునిచ్చారు. యూరోపియన్ యూనియన్ ఎలక్షన్స్ లో ప్రతిపక్ష పార్టీ నేషనల్ ర్యాలీకి సానుకూలత వచ్చింది. దీంతో, ఈ నిర్ణయం తీసుకున్నారు. ముందస్తుగా నిర్వహించే ఎన్నికలే స్నాప్ ఎలక్షన్స్. ఎలాంటి ప్రకటనలు చేయకుండానే, పూర్తిస్థాయి పదవీకాలం ముగియకముందే వీటిని నిర్వహిస్తారు. అనుకూల పరిస్థితుల నుంచి లబ్ధి పొందేందుకు, ఏదైనా ప్రతిష్టంభన ఏర్పడినప్పుడు పరిష్కారం కోసం ఈ ఎన్నికలను ఆశ్రయిస్తారు.
యూరోపియన్ యూనియన్ ఎన్నికలు
ఫ్రాన్స్ పార్లమెంటులో నేషనల్ ర్యాలీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. గతవారం జరిగిన యూరోపియన్ యూనియన్ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల ఫలితాలు విపక్ష పార్టీ నేషనల్ ర్యాలీకి అనుకూలంగా ఉంటాయని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు. మేక్రాన్ పార్టీ రినైజన్స్‌కు 14.8 శాతం నుంచి 15.2 శాతం ఓట్లు రావొచ్చని పేర్కొన్నాయి. ప్రతిపక్ష పార్టీకి మాత్రం 32 నుంచి 33 శాతం మధ్య ఓట్లు వస్తాయని అంచనా వేశాయి. 2027 వరకు ఆగితే.. నేషనల్ ర్యాలీకి మరింత పట్టు సాధింస్తుందని తెలుస్తోంది. అందుకోసమే ముందస్తు ఎన్నికలకు మేక్రాన్ వెళ్లారు. ఈ నిర్ణయంతో వచ్చే 20 రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 30న తొలిదశ పోలింగ్ జరగనుండగా.. జులై 7న రెండోదశ జరగనుంది.